దేశ అంతర్గత విషయాల్లో చైనా జోక్యం సహించంః భారత్

సరిహద్దు వివాదలతో తరుచు గిల్లిగజ్జాలకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి ఏమాత్రం మారడంలేదు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఇండియా మరోసారి స్పష్టం చేసింది.

దేశ అంతర్గత విషయాల్లో చైనా జోక్యం సహించంః భారత్
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 16, 2020 | 1:37 PM

సరిహద్దు వివాదలతో తరుచు గిల్లిగజ్జాలకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి ఏమాత్రం మారడంలేదు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఇండియా మరోసారి స్పష్టం చేసింది. ఈ భారత అంతర్గత విషయాల్లో చైనా జోక్యాన్ని సహించబోమని హెచ్చిరించింది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని గుర్తించబోమంటూ చైనా చేసిన ప్రకటనపై గురువారం భారత విదేశాంగ శాఖ ఘాటుగానే స్పందించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌ నుంచి విడదీయలేని అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయాలను గతంలోనూ పలుమార్లు, అత్యున్నత వేదికలపై సహా భారత్‌ స్పష్టం చేసిందన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ప్రారంభించిన చర్చల గురించి వివరిస్తూ.. బలగాల ఉపసంహరణ ఇరు దేశాలకు సంక్లిష్టమైన ప్రక్రియ అని, బలగాలను గత రెగ్యులర్‌ పోస్ట్‌లకు పంపించాల్సి ఉంటుందని, అందుకు కొంత సమయం పడుతుందని శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు.

మరోవైపు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు కోసం భారత్, చైనాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఏం జరుగుతోందనేది రహస్యమని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వెంట ఈ స్థాయిలో బలగాల మోహరింపు గతంలో జరగలేదన్నారు. కాగా,1993 నుంచి పలు ద్వైపాక్షిక ఒప్పందాలతో భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు.