Cigarette Excise Duty Hike: కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, పాన్ మసాలాపై అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్ విధించింది. ఫిబ్రవరి 1 నుండి ఇది అమలులోకి వస్తుంది. పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% జీఎస్టీతో పాటు, పాన్ మసాలాపై ప్రత్యేక సెస్ కూడా ఉంటుంది. ఈ చర్యలతో ధరలు భారీగా పెరిగి, వినియోగదారులకు పొగాకు ఉత్పత్తులు కొనడం కష్టతరం కానుంది.