Vande Bharat Sleeper Water Test: వందే భారత్ స్లీపర్ రైళ్ల వాటర్ టెస్ట్ విజయవంతమైంది. 180 కి.మీ. వేగంతో ప్రయాణించినా, వాటర్ గ్లాస్ నుండి నీటి చుక్క కూడా పడలేదు. దీని ద్వారా రైలు అద్భుతమైన స్థిరత్వాన్ని నిరూపించుకుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వీడియోను పంచుకున్నారు. త్వరలోనే ఈ అత్యాధునిక స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.