Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Har Ghar Lakhpati: ఎస్‌బీఐ నుంచి మరో సూపర్ స్కీమ్ లాంచ్.. నెలవారీ పెట్టుబడితో అదిరే రాబడి

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల, అవసరాల నేపథ్యంలో పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా నెలవారీ ఆదాయం పొందే ఉద్యోగస్తులకు కచ్చితంగా తమ పెట్టుబడి పరిధిని విస్తరించాలని పేర్కొంటున్నారు. నెలవారీ పొదుపు చేసే వారిని ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్‌ను లాంచ్ చేసింది. హర్ ఘర్ లాక్‌పాటి పేరుతో లాంచ్ చేసిన ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

SBI Har Ghar Lakhpati: ఎస్‌బీఐ నుంచి మరో సూపర్ స్కీమ్ లాంచ్.. నెలవారీ పెట్టుబడితో అదిరే రాబడి
Indian Money
Follow us
Srinu

|

Updated on: Mar 16, 2025 | 2:43 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘హర్ ఘర్ లాక్‌పాటి పథకం అనేది ఓ ప్రత్యేక పునరావృత డిపాజిట్ పథకం. ఈ పథకం మూడు నుంచి పది సంవత్సరాల కాలంలో చిన్న నెలవారీ డిపాజిట్లతో వ్యక్తులు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ పొదుపును సేకరించడంలో సహాయపడుతుంది. ఈ ఖాతాను మైనర్లతో సహా అన్ని వ్యక్తులు ఒంటరిగా లేదా సంయుక్తంగా ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో ఇచ్చే వడ్డీ రేటు కాలపరిమితి, వర్గం ఆధారంగా మారుతుంది. సాధారణ ప్రజలకు మూడు నుంచి నాలుగు సంవత్సరాలకు 6.75 శాతం, ఐదు నుంచి పది సంవత్సరాలకు 6.50 శాతం సీనియర్ సిటిజన్లకు మూడు నుంచి నాలు సంవత్సరాలకు 7.25 శాతం, ఐదు నుంచి పది సంవత్సరాలకు 7.00 శాతం వడ్డీ రేట్లను ఇస్తున్నారు. 

ఈ పథకంలో ముందస్తు మూసివేత నియమాలు కూడా ఉన్నాయి. రూ.5 లక్షల డిపాజిట్ వరకు ఉంటే దాదాపు 0.50 శాతం జరిమానా విధిస్తారు. డిపాజిట్ రూ.5 లక్షలు దాటితే, 1 శాతం జరిమానా విధిస్తారు. అయితే వడ్డీపై జరిమానా రేటు లేదా ఒప్పంద రేటు ఏది తక్కువైతే దాని ప్రకారం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏడు రోజుల్లోపు డిపాజిట్ ఉపసంహరించుకుంటే వడ్డీ చెల్లించరు. అలాగే వాయిదాల చెల్లింపులు ఆలస్యమైతే ఐదు సంవత్సరాల వరకు ప్రతి రూ.100కు నెలకు రూ.1.50 చొప్పున జరిమానా, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ప్రతి రూ.100కు రూ.2 చొప్పున జరిమానా విధిస్తారు. అయితే వరుసగా ఆరు వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకు ఆ ఖాతాను గడువుకు ముందే మూసివేస్తారు. అదే సమయంలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ను కస్టమర్ లింక్ చేసిన పొదుపు ఖాతాకు చెల్లిస్తారు. 

ఎస్‌బీఐ హర్ ఘర్ లాక్‌పాటి పథకం ద్వారా రూ. 3 లక్షల కార్పస్ సేకరించడానికి అవసరమైన నెలవారీ డిపాజిట్ పెట్టుబడి కాలపరిమితి ఆధారంగా మారుతుంది. సాధారణ ప్రజలలో ఎవరైనా మూడు సంవత్సరాలలో ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే వారు నెలకు సుమారు రూ. 7,506 పెట్టుబడి పెట్టాలి. అయితే సీనియర్ సిటిజన్ నెలకు దాదాపు రూ. 7,446 డిపాజిట్ చేయాలి. ఐదేళ్ల కాలపరిమితిలో రూ. 3 లక్షలు జమ చేయడానికి సాధారణ ప్రజలకు నెలవారీ డిపాజిట్ రూ. 4,227 మరియు సీనియర్ సిటిజన్లకు దాదాపు రూ. 4,173 అవసరం అవుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి