AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Armaan Malik: ప్రియురాలితో స్టార్‌ సింగర్‌ నిశ్చితార్థం .. మోకాలిపై కూర్చుని ఉంగరం తొడుగుతూ.. ఫొటోస్‌ చూశారా?

దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ పాటలను ఆలపించిన ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలితో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఇవాళ (ఆగస్టు 28) తన చిరకాల స్నేహితురాలు, యూట్యూబ్‌ సెన్సేషన్‌ అష్నా ష్రాఫ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు అర్మాన్‌ మాలిక్‌.

Armaan Malik: ప్రియురాలితో స్టార్‌ సింగర్‌ నిశ్చితార్థం .. మోకాలిపై కూర్చుని ఉంగరం తొడుగుతూ.. ఫొటోస్‌ చూశారా?
Armaan Malik, Aashna Shroff
Basha Shek
|

Updated on: Aug 28, 2023 | 9:39 PM

Share

దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ పాటలను ఆలపించిన ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలితో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఇవాళ (ఆగస్టు 28) తన చిరకాల స్నేహితురాలు, యూట్యూబ్‌ సెన్సేషన్‌ అష్నా ష్రాఫ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు అర్మాన్‌ మాలిక్‌. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా మోకాళ్లపై కూర్చొని ప్రియురాలికి ఉంగరం తొడిగాడు అర్మాన్‌ మాలిక్‌. ఈ సంతోషకరమైన సందర్భానికి సంబంధించిన ఫోటోలను అర్మాన్ మాలిక్, ఆష్నా ష్రాఫ్ తమ సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు . దీంతో ఒక్కసారిగా ఈ ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. అదే క్రమంలో ఈ అందమైన జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. వరుణ్ ధావన్, ఇషాన్ ఖట్టర్, రియా చక్రవర్తి, టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, ఈషా గుప్తా, దివ్య త్రిపాఠి తదితర సినిమా సెలబ్రిటీలు అర్మాన్‌- అష్నాజంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

సరేగమప లిటిల్‌ ఛాంప్స్‌ తో మొదలై..

కాగా అష్నా ష్రాఫ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందింది. అలాగే బ్యూటీ బ్లాగర్‌గా పేరు తెచ్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 9 లక్షలకు పైగా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక అర్మాన్ మాలిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 4 సంవత్సరాల వయస్సులో సంగీతంపై ఆసక్తిని పెంచుకుకున్న అతను 2006లో ‘సరేగమప లిటిల్ చాంప్స్’ అనే రియాల్టీ షోలో పాల్గొని సత్తా చాటాడు. టీనేజ్‌లోనే మంచి సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కొన్ని సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, మలయాళ భాషల్లో స్టార్‌ సింగర్‌గా వెలుగొందుతున్నాడు అర్మాన్‌.

ఇవి కూడా చదవండి

తెలుగులో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో..

తెలుగు పాటల విషయానికొస్తే.. రక్త చరిత్ర 2, రౌడీ ఫెలో, కాటమరాయుడు, మహానుభావుడు, హలో, తొలిప్రేమ, ఏక్తా, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, అరవింద సమేత వీర రాఘవ, పడిపడి లేచే మనసు, మిస్టర్‌ మజ్ఞు, సీత, అలా వైకుంఠపురం, ఓరేయ్‌ బుజ్జిగా, సోలో బ్రతుకే సో బెటర్‌, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, వకీల్‌ సాబ్‌, ఇచ్చట వాహనములు నిలపరాదు, టక్‌ జగదీస్‌, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, మేజర్‌, థ్యాంక్యూ, రంగ రంగ వైభవంగా, స్వాతిముత్యం , ఓరి దేవుడా, గుర్తుందా శీతాకాలం, శాకుంతలం, లేటెస్ట్‌ స్కంద సినిమాల్లోని పాటలు ఆలపించాడు.

అర్మాన్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ 

అర్మాన్ మాలిక్, అష్నా లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.