Maareesan Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాసిల్ కామెడీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..

ఫహాద్ ఫాసిల్.. ఇప్పుడు పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈహీరో.. విక్రమ్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తున్నారు.

Maareesan Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాసిల్ కామెడీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..
Maareeshan

Updated on: Aug 17, 2025 | 1:56 PM

మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటిస్తున్న ఫహాద్.. ఇటీవలే మారీశన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఫహాద్ ఫాసిల్, వడివేలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ డ్రామా జూలైలో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎప్పటిలాగే ఫహాద్, వడివేలు తమ నటనతో ఆకట్టుకున్నారు. సుదీప్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమా ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. కామెడీతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఉత్కంఠతకు గురిచేసింది. ఇందులో కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, లివింగ్ స్టన్, రేణుక వంటి వారు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇదిలా ఉంటే.. మారీశన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్ట్ 22 నుంచి ఈసినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఫహాద్ మరో విభిన్న పాత్రలో నటించగా.. వడివేలు తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. అటు హాస్యం.. ఇటు భావోద్వేగంతో ఈ సినిమా ఆద్యంతం కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

కథ విషయానికి వస్తే..

దయాలన్ (ఫహాద్) అనే దొంగ, వేలాయుధం పిళ్లై (వడివేలు) అనే అల్జీమర్స్ బాధితుడి వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకుంటాడు. అయితే అప్పుడే వేలాయుధం తన స్నేహితుడిని కలిసేందుకు ఊరుకు బయలుదేరతాడు. దీంతో అతడితో మాటలు కలిపి.. తన బైక్ పై తీసుకెళ్తాడు దయాలన్. ఆ తర్వాత ఇద్దరి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. ? వేలాయుధం డబ్బును దయాలన్ దొచుకున్నాడా ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..