Santosh Sobhan: బిజీ హీరోగా మారనున్న ఏక్ మినీ కథ హీరో.. ఒక్క హిట్ తో వరుస అవకాశాలు

టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త హీరోల జోరు నడుస్తుంది. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కామెడీ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ జోనర్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు

Santosh Sobhan: బిజీ హీరోగా మారనున్న ఏక్ మినీ కథ హీరో.. ఒక్క హిట్ తో వరుస అవకాశాలు
Follow us
Rajeev Rayala

|

Updated on: May 31, 2021 | 8:05 AM

Santosh Sobhan:

టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త హీరోల జోరు నడుస్తుంది. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కామెడీ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ జోనర్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఆ జాబితాలోనే ఈ కుర్ర హీరో కూడా జాయిన్ అయ్యాడు. సంతోష్ శోభన్ నటియించిన ఏక్ మినీ కథ ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై మంచి హిట్ ను అందుకుంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు యూవి కాన్సెప్ట్స్ అనే న్యూ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిస్తోంది. అయితే ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా తెరకెక్కింది ‘ఏక్ మినీ కథ’. ‘తను నేను’ .. ‘పేపర్ బాయ్’ సినిమాలతో సంతోష్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. అయితే  ఏక్ మినీ కథ సినిమా బయటికి రాకముందే ఈ కుర్రాడు వరుస సినిమాలను లైన్లో పెట్టేయడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో .. వైజయంతీ మూవీస్ బ్యానర్లో .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంతోష్ శోభన్ సినిమాలు చేయనున్నాడు. అలాగే ఓ డెబ్యూ డైరెక్టర్ తో ఓ సినిమా చేయనున్నాడట. వీటన్నిటితో పాటుగా సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడని స్వయంగా బయటపెట్టాడు. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇలా వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ఈ కుర్ర హీరో కెరియర్ ను పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prasanth Varma: విభిన్న‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటున్న యంగ్ మేక‌ర్ ప్ర‌శాంత వ‌ర్మ‌

Satya Dev: విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో యువ న‌టుడు స‌త్య దేవ్.. డిజిట‌ల్ వైపు అత‌డి రాబోయే సినిమాలు

Varun Tej: వ‌రుణ్ తేజ్‌ ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌ను భ‌లే తిప్పుతున్నాడే.. మీరూ ఇలా చేయ‌గ‌ల‌రేమో ఓసారి ట్రై చేయండి..