AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SeethaRamam: ‘సీతారామం’ వేడుకకు కదలివచ్చిన ఆదిపురుషుడు..

అందమైన ప్రేమ కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇప్పటికే  చాలా లవ్ స్టోరీ సినిమాలు ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా సీతారామం అనే మరో ప్రేమ కథ ప్రేక్షకులను అలరించాడనికి రానుంది.

SeethaRamam: 'సీతారామం' వేడుకకు కదలివచ్చిన ఆదిపురుషుడు..
Sitaramam
Rajeev Rayala
|

Updated on: Aug 03, 2022 | 7:04 PM

Share

అందమైన ప్రేమ కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇప్పటికే  చాలా లవ్ స్టోరీ సినిమాలు ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా సీతారామం(SeethaRamam )అనే మరో ప్రేమ కథ ప్రేక్షకులను అలరించాడనికి రానుంది. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దృశ్యకావ్యంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న,సుమంత్ , తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.

తాజాగా సీతారామం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా హాజరవుతున్నారు. యుద్ధం తో రాసిన ప్రేమ కథ అనే క్యాప్షన్ తో వస్తోన్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దుల్కర్ ఈ సినిమాతో డైరెక్ట్ గా తెలుగులోకి అడుపెడుతున్నారు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టడం ఖాయమని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Follow Us