Thank You: ఓటీటీలోకి వచ్చేస్తున్న థాంక్యూ.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
ప్రస్తుతం చైతూ లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సౌత్ అబ్బాయి బాలరాజు పాత్రలో కనిపించనున్నారు.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Nagachaitanya) ప్రధాన పాత్రలో నటించిన సినిమా థాంక్యూ (Thank You). డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 22న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించగా.. శ్రీవెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో ఆగస్ట్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట మేకర్స్. ఈసినిమాలో చైతూ త్రీ వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చైతూ లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సౌత్ అబ్బాయి బాలరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇందులో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.