Dulquer Salmaan: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దుల్కర్ సినిమా.. ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’గా రానున్న మూవీ..
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు దుల్కర్ సల్మాన్.
Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు దుల్కర్ సల్మాన్. ఈ సినిమా ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఓకే బంగారం సినిమా తర్వాత దుల్కర్ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఇక కీర్తిసురేష్ నటించిన మహానటి సినిమాలో దుల్కర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో దుల్కర్ మార్కెట్‌ను అమాంతం పెంచేసింది. కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు దుల్కర్. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ హీరో.. ఇప్పుడు నేరుగా తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు దుల్కర్. లెఫ్టినెంట్ రామ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే క్యాప్షన్ టైటిల్‌కి ఇచ్చారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ మెజారిటీ భాగం హిమచల్ ప్రదేశ్ కశ్మీర్ పరిసరాల్లో సాగుతోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని భావించారు… అయితే ఇందులో తనదైన మార్క్ లవ్ స్టోరీని హనురాఘవపూడి చూపనున్నాడని తెలుస్తోంది. లవ్ స్టోరీలకు ఈ యంగ్ డైరెక్టర్ పెట్టింది పేరు. అందాల రాక్షసి సినిమాతో పరిచయమైన హను.. ఆ తర్వాత లై, కృష్ణగాడి ప్రేమ గాద, పడిపడిలేచే మనసు వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక హను లవ్ ట్రాక్‌లను తెరపై ఎంతో అందంగా ఆవిష్కరించగలడు. కాబట్టి ఈ వార్ నేపథ్యం ఉన్న లవ్ స్టోరీలోనూ తనదైన మార్క్ వేయనున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :