Double Ismart Review: ‘డబుల్ ఇస్మార్ట్’ రివ్యూ.. పూరి, రామ్ కాంబో మళ్లీ హిట్టయ్యిందా..?

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. 5 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ చేశారు. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Double Ismart Review: 'డబుల్ ఇస్మార్ట్' రివ్యూ.. పూరి, రామ్ కాంబో మళ్లీ హిట్టయ్యిందా..?
Double Ismart
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 15, 2024 | 6:34 PM

మూవీ రివ్యూ: డబుల్ ఇస్మార్ట్

నటీనటులు: రామ్ పోతినేని, కావ్య తపర్, సంజయ్ దత్, ఝాన్సీ తదితరులు

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్

నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మికౌర్

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. 5 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ చేశారు. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఇస్మార్ట్ శంకర్ (రామ్) తనలో చిప్ పెట్టుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో లండన్ లో ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిగ్ బుల్ (సంజయ్ దత్) కు మెదడుకు సంబంధించిన సమస్య ఒకటి వస్తుంది. హాయ్ రా బతకాలంటే అతని మెమొరీని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలని డాక్టర్స్ చెప్తారు. దాంతో ఇండియాకు వచ్చి ఇస్మార్ట్ శంకర్ కోసం వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. అతడి జీవితంలోకి జన్నత్ (కావ్య) ఎలా వచ్చింది అనేది పూర్తి కథ..

కథనం:

బ్రాండ్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు.. సీక్వెల్ కూడా.. అయినా కథ బాగుంటే సీక్వెల్ వర్కవుట్ అవుతుంది కానీ బ్రాండ్ నేమ్ తో కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు పూరి జగన్నాథ్. ఐదేళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు మొదట యావరేజ్ టాక్ వచ్చినా.. కూడా పరిస్థితులు అన్నీ కలిసి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. నాకు నచ్చలేదు.. రామ్ ఎనర్జీ, పాటలు వర్క్ అవుట్ అవ్వడంతో సినిమా రేంజ్ మారిపోయింది. మళ్లీ అదే కథను సేమ్ టెంప్లేట్ లో వేసుకుని డబుల్ ఇస్మార్ట్ తీశాడు పూరి. సంబంధం లేని సన్నివేశాలు, కామెడీ కోసం రాసిన ట్రాక్ లు.. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్.. ఇవన్నీ చూస్తుంటే.. పూరీలోని రైటర్ ఇంత దిగజారిపోయాడా అని బాధనిపించింది. అలీ ట్రాక్ అయితే మరీ దారుణం.. కథకు సంబంధమే లేని కామెడీ కానీ కామెడీ ఇది. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు.. రెండూ రెండే.. దొందు దొందే.. చాలా వరకు సీన్స్ ల్యాగ్ అనిపించాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని సీన్స్ రాసుకున్నాడు కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ లో కనీసం కొన్ని కామెడీ సీన్స్ తో పాటు, పాటలు బాగుంటాయి. ఇందులో అలా గుర్తు పెట్టుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు. ఏదో ఒక సినిమా చేయాలి అన్నట్టు చేసాడే కానీ.. కాన్సట్రేట్ చేసి తీసినట్టు ఎక్కడా అనిపించలేదు. పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఊహించడం కాస్త కష్టమే. కానీ ఎందుకో సంబంధం లేని సన్నివేశాలు చాలా రాసుకున్నట్టు అనిపించింది.

నటీనటులు:

రామ్ మరోసారి ఎనర్జీ చూపించాడు. క్యారెక్టర్ కోసం కష్టపడ్డాడు. పాటల్లో డాన్సులు అదిరిపోయాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. సంజయ్ దత్ జస్ట్ ఓకే.. కావ్య తపర్ పూర్తిగా గ్లామర్ కే పరిమితమైంది. గెటప్ శ్రీను ఉన్నంతవరకు బాగానే చేశాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ప్రధానమైన పాజిటివ్ పాయింట్ మణిశర్మ మ్యూజిక్. సీక్వెల్ లో ఆరెంజ్ మ్యాజిక్ కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఎడిటింగ్ చాలావరకు స్లోగా ఉంది. చాలా సన్నివేశాలు తీసేయొచ్చు. కానీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాబట్టి ఎడిటర్ ను తప్పు పట్టలేము. సినిమాటోగ్రఫీ పర్లేదు. పూరి జగన్నాథ్ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.. ఎలాంటి దర్శకుడు ఎలా అయిపోయాడో అనే బాధ తప్ప. సినిమాను ఇంకాస్త బాగా చేయొచ్చు కానీ చేయలేకపోయాడు ఏమో అనిపించింది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా డబుల్ ఇస్మార్ట్.. నచ్చడం కష్టమే..