- Telugu News Photo Gallery Cinema photos Tharun Bhascker Gets Emotional On His Mother Geeta Bhascker Singapore Trip
Tharun Bhascker: ‘అమ్మ రుణం కొంతైనా తీర్చుకున్నాను’.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఎమోషనల్.. ఏమైందంటే?
రైటర్ గా, హీరోగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్ గా, యాంకర్‌గా..ఇలా టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంట్ తో దూసుకుపోతున్నాడు తరుణ్ భాస్కర్. అన్నట్లు తరుణ్ తల్ గీతా భాస్కర్ కూడా టాలీవుడ్ లో బాగా ఫేమస్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీ ఫిదాలో ఆమె కీలక పాత్ర పోషించింది.
Updated on: Aug 15, 2024 | 6:43 PM

రైటర్ గా, హీరోగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్ గా, యాంకర్‌గా..ఇలా టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంట్ తో దూసుకుపోతున్నాడు తరుణ్ భాస్కర్. అన్నట్లు తరుణ్ తల్ గీతా భాస్కర్ కూడా టాలీవుడ్ లో బాగా ఫేమస్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీ ఫిదాలో ఆమె కీలక పాత్ర పోషించింది.

తాజాగా తరుణ్ భాస్కర్ వాళ్ల అమ్మ గీత భాస్కర్ ని సింగపూర్ టూర్ కు తీసుకెళ్లాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా తన తల్లితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని తల్చుకుని ఎమోషనలయ్యాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

'నా చిన్న తనంలో నన్ను స్కూల్‌కు తీసుకెళ్లేందుకు అమ్మ కిలో మీటర్ల దూరం నడిచేది. బస్సుకి డబ్బుల్లేక అలా నడుచుకుంటూ వచ్చేది. ఇప్పుడు అమ్మ రుణాన్ని కాస్త ఇలా తీర్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్.

అమ్మను ఇలా సింగపూర్ ట్రిప్‌కు తీసుకు రావడంతో ఎంతో గర్వంగా ఉందన్నాడు తరుణ్ భాస్కర్ . ప్రస్తుతం వీరి సింగపూర్ పర్యటన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

పెళ్లి చూపులు, ఏమైంది ఈ నగరానికి, కీడాకోలా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. మహానటి, సమ్మోహనం, ఫలక్ నుమా దాస్ సినిమాల్లో నటుడిగా మెప్పించాడు.

ఇక మీకు మాత్రమే చెప్తా సినిమాతో సోలో హీరోగానూ సక్సెస్ అయ్యాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడీ క్రేజీ డైరెక్టర్ ఆసక్తికరంగా ఇడుపు కాయితం పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు