సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేసి మెప్పించారు శోభిత ధూళిపాల. ఓటీటీల్లోనూ ఆమెకు క్రేజ్ ఉంది. ఇటీవల హాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్ చేశారు. అమెరికన్ ఫిల్మ్ మంకీ మ్యాన్‌లో ఆమె చేసిన సీత కేరక్టర్ మెప్పించింది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో మంచి పెర్ఫార్మర్‌గా పేరున్న శోభిత ఒక్కసారిగా ఎంగేజ్‌మెంట్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేశారు.