- Telugu News Photo Gallery Cinema photos Actress Rashmika Mandanna says that she faced many difficulties in starting her career Telugu Heroines Photos
Rashmika Mandanna: కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డా.. అంటున్నరష్మిక మందన్న.!
ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న రష్మిక మందన్న కూడా కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడ్డారు. తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు నేషనల్ క్రష్. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయి ఇప్పడు పాన్ ఇండియా మార్కెట్‌ను రూల్ చేస్తున్న బ్యూటీ రష్మిక మందన్న.
Updated on: Aug 15, 2024 | 6:28 PM

ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న రష్మిక మందన్న కూడా కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడ్డారు.

తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు నేషనల్ క్రష్. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయి ఇప్పడు పాన్ ఇండియా మార్కెట్‌ను రూల్ చేస్తున్న బ్యూటీ రష్మిక మందన్న.

తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు.

హంపీ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీగా తెరకెక్కనుంది వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్. స్త్రీ2, బేడియా, ముంజ్య సినిమాల కోవలో ఈ మూవీ కూడా మెప్పిస్తుందనే టాక్ ఆల్రెడీ మొదలైంది. తాజా సినిమాలో రష్మిక కేరక్టర్‌కి నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయట.

ఆడిషన్స్‌కు వెళ్లిన ప్రతీసారి రిజెక్ట్ అవుతుండటంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లేదాన్నని చెప్పారు. కొంత మంది ముఖం మీద 'నువ్వు నటిగా సక్సెస్ కాలేవు' అని చెప్పిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.

విషయం ఏదైనా సరే, కూర్చుని తీరిగ్గా ఆలోచించే సమయం లేదు మిత్రమా అని అంటున్నారు రష్మిక మందన్న. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ.

ఫైనల్‌గా కిరిక్ పార్టీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత టాలీవుడ్ సినిమాలతో నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు ఈ బ్యూటీ.




