Anand Movie: ఆనంద్ మూవీ హీరో రాజా గుర్తున్నారా..? సినిమాలు మానేసి ఏం చేస్తున్నారంటే..
డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. ప్రేక్షకుల మనసులను హత్తుకునే అద్భుతమైన కథలను వెండితెరపైకి తీసుకురావడంలో ఆయనకు సాటి లేరు. ఇటీవలే కుభేర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున కీలకపాత్రలు పోషించారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. అందులో ఆనంద్ సినిమా ఒకటి. ఈ మూవీ పేరు చెప్పగానే.. ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయి అనే డైలాగ్ సైతం గుర్తుకువస్తుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో హీరోగా ఆనంద్, కథానాయికగా కమలిని నటించారు. ఈ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో హీరోగా.. అలాగే సెకండ్ హీరోగా కనిపించారు రాజా. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే రాజా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇంతకీ రాజా ఎక్కడున్నారు..? ఇప్పుడేం చేస్తున్నారు ? తెలుసుకుందామా.
రాజా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాజా.. ఆ తర్వాత ఒంటరిగానే జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం తెచ్చుకుని సెటిల్ అయ్యారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో థియేటర్ యాక్టింగ్ కోర్సులో చేరారు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు. ఒకసారి సికింద్రాబాద్ క్లబ్ లో నాటకం వేయడానికి వచ్చి విలేకరుల కళ్లల్లో పడ్డారు. దీంతో ఓ చినదాన సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇక ఆనంద్ సినిమాతో ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న రాజా.. ఆ తర్వాత వెన్నెల, మాయా బజార్, మొగుడు పెళ్లాం ఓ దొంగోడు, ఇంకోసారి, ఓ చినదాన వంటి సినిమాల్లో నటించారు.
తెలుగులో రాజా నటించిన చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు రాజా. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాజా.. ప్రస్తుతం ఫాస్టర్ గా మారారు. అయితే గతంలో రాజా ఆత్మహత్య చేసుకున్నారంటూ ప్రచారం నడిచింది. గతంలో అలీతో సరదాగా షోలో పాల్గొన్న రాజా.. ఆవార్తలపై స్పందిస్తూ.. సినిమాలు లేవు.. అవకాశాలు ఇవ్వడం లేదని.. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సూసైడ్ అటెప్ట్ చేశానంటూ వార్తలు రాశారు. బతికున్న మనిషిని అలా చంపేయడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రస్తుతం రాజా ఫాస్టర్ గా దేవుడి గురించి స్పీచ్ ఇస్తుంటారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..
Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..
Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌తో రచ్చ.. ఎవరంటే..
Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్లో ఊహించని విధంగా..








