AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రభాస్, షారుఖ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన కుర్రహీరో.. ఒక్క సినిమాతో బాక్సాఫీస్ షేక్..

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, షారుఖ్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సత్తా చాటుతున్నారు. కానీ మీకు తెలుసా.. ? తాజాగా ఓ యంగ్ హీరో థియేటర్లలో సంచలనం సృష్టించారు. ఈ హీరోస్ అందరి రికార్డ్స్ బ్రేక్ చేసి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? ఇంతకీ అతడు నటించిన సినిమా గురించి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందామా.

Tollywood: ప్రభాస్, షారుఖ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన కుర్రహీరో.. ఒక్క సినిమాతో బాక్సాఫీస్ షేక్..
Prabhas, Shah Rukh Khan
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2025 | 8:28 PM

Share

2025 సంవత్సరం ఆరు నెలలు పూర్తైంది. అంటే ఈ ఏడాది దాదాపు సగం ముగిసింది. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఏఏ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..? ఏవి అట్టర్ ప్లాప్ అయ్యాయి ? అనేది తెలుసుకుందామా. తాజాగా IMDb అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాను పంచుకుంది. అందులో ఒక సినిమా బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం 500 రెట్లు ఎక్కువగా రాబట్టాయి. అంతేకాదు.. ప్రభాస్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ హీరో గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సికందర్, సితారే జమీన్ వంటి అన్ని చిత్రాలను వెనక్కి నెట్టి అత్యధిక వసూళ్లు సాధించింది. ఇది బాక్సాఫీస్ వద్ద చాలా కలెక్షన్స్ రాబట్టిన చారిత్రక చిత్రం. IMDb 1 జనవరి 2025 నుండి 1 జూలై 2025 వరకు ఉన్న సినిమాలను ప్రకటించింది. అందులో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన చావా అగ్రస్థానంలో ఉంది. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా అనే చారిత్రాత్మక చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, వినీత్ వంటి తారలు నటించారు. ఈ చిత్రం రూ. 809 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. బడ్జెట్ రూ. 130 కోట్లు కాగా, ఈ చిత్రం 500% లాభం రాబట్టింది. ఇక ఈ సంవత్సరం ఇదే అతిపెద్ద బ్లాక్ బస్టర్.

ఛావాలో అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ , విక్కీ కౌశల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక IMDB విడుదల చేసిన జాబితాలోడ్రాగన్ 2వ స్థానంలో, దేవా 3వ స్థానంలో, రైడ్ 2 4వ స్థానంలో, రెట్రో 5వ స్థానంలో, ది డిప్లొమాట్ 6వ స్థానంలో, ఎంపురాన్ 7వ స్థానంలో, సితారే జమీన్ పర్ 8వ స్థానంలో, కేసరి చాప్టర్ 2 9వ స్థానంలో, విదాముయార్చి 10వ స్థానంలో ఉన్నాయి.

ప్రస్తుతం ఛావా చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో రష్మిక, విక్కీ కౌశల్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి : 

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..

Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..

Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్‏గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‏తో రచ్చ.. ఎవరంటే..

Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్‏లో ఊహించని విధంగా..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!