Nuvvu Nenu Movie: ఆహా.. ఏమా అందం.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ లుక్కు చూస్తే మైండ్ బ్లాంకే..

సాధారణంగా సినీరంగంలో కొంతమంది హీరోయిన్స్ తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అందం, అభినయంతో జనాల మనసులలో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఒకట్రెండు సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంటారు. వారి పేరు చెప్పగానే ఆ హీరోయిన్ సినిమాలు, సాంగ్స్ వెంటనే మదిలో మెదులుతుంటాయి. అలాంటి వారిలో హీరోయిన్ అనిత ఒకరు. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే సినిమా నువ్వు నేను.

Nuvvu Nenu Movie: ఆహా.. ఏమా అందం.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ లుక్కు చూస్తే మైండ్ బ్లాంకే..
Nuvvu Nenu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2024 | 5:31 PM

తెలుగు సినీరంగంలో ఎన్నో అద్భుతమైన ప్రేమకథలు వచ్చాయి. ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన లవ్ స్టోరీస్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా దివంగత హీరో ఉదయ్ కిరణ్ ప్రధాన పాత్రలలో నటించిన కొన్ని సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఉదయ్ కిరణ్ చిత్రాలు.. అందులోని సాంగ్స్ ఇప్పటికీ తగ్గని క్రేజ్ ఉంది. ఉదయ్ కిరణ్ నటించిన అందమైన చిత్రాల్లో నువ్వు నేను ఒకటి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అనిత. ఈ మూవీతో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో.. ప్రేక్షకుల్లో ఆమె పేరు మారుమోగిపోయింది. అందం, అభినయంతో అప్పటి కుర్రాళ్ళను ఫిదా చేసింది. ఒకప్పుడు హీరో ఉదయ్ కిరణ్‌ అనితల పెయిర్ మూవీలో చాలా క్యూట్‌గా ఆకట్టుకుంటుంది. నువ్వు నేను తర్వాత తెలుగులో అనితకి మంచి అవకాశాలు వచ్చాయి. శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిప్ట్ అయిన అనిత.. అక్కడే సినిమాలు, సీరియల్స్ చేస్తూ సెటిల్ అయ్యింది.

2013 లో గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని మ్యారేజ్ చేసుకున్న అనిత ఆ తర్వాత తను సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. అలాగే హిందీలో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది అనిత. సుహాస్ నటిస్తోన్న ఓ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏజ్ 44 సంవత్సరాలు. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో మంత్రముగ్దులను చేస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.