- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Janakiram son Taraka Rama Rao will make his debut as a hero, nandamuri family members wishes to him
Nandamuri Taraka Rama Rao: నందమూరి వంశంలో నాలుగో తరం హీరో రెడీ.! మళ్లీ ఎన్టీఆర్ నే..
నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బాలయ్య వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దేవరతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరు హీరోలు వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అయ్యారు. హరికృష్ణ మనవడు, జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నారు.
Updated on: Nov 03, 2024 | 5:11 PM

నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బాలయ్య వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దేవరతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎమర్జ్ అయ్యారు.

ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరు హీరోలు వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అయ్యారు.

హరికృష్ణ మనవడు, జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నారు. బుధవారం జరిగిన ఈవెంట్‌లో ఈ నయా ఎన్టీఆర్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేశారు.

గత 18 నెలలుగా వైవీఎస్ పర్యవేక్షణలో ట్రైన్ అవుతున్న రామ్, ఆయన దర్శకత్వంలోనే తెరకు పరిచయం అవుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెలుగు సాంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాతో తెరకు పరిచయం అవుతున్నారు రామ్.

ఇప్పటికే దానవీర శూర కర్ణ సినిమాలో కృష్ణుడి పాత్రలో బాల నటుడిగా మెప్పించారు రామ్. ఆల్రెడీ బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫార్మ్ అయ్యింది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షూ ఎంట్రీని గ్రాండ్‌గా ఎనౌన్స్ చేశారు. డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇలా ఒకే టైమ్‌లో ఇద్దరు హీరోలు పరిచయం అవుతుండటంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.




