- Telugu News Photo Gallery Cinema photos Actress Eesha Rebba Beautifull Saree Photos Goes Viral In Social Media
Eesha Rebba: ఏమున్నావ్ అమ్మాయ్.. చిలకపచ్చ చీరలో తెలుగింటి అందం.. కట్టిపడేస్తోన్న ఈషా రెబ్బ..
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. అందులో ఈషా రెబ్బ ఒకరు. ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది
Updated on: Nov 03, 2024 | 4:50 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువమంది తెలుగమ్మాయిలలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో సినీ ప్రియులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారికి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. అమీ తుమీ, విస్మయం, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీలోనూ మెరిసింది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించిన ఈ అమ్మడు.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేసింది. వెబ్ సిరీస్ చేస్తూ సినీ ప్రియులను అలరించింది.

తాజాగా చిలకపచ్చ చీరలో అందంగా ముస్తాబయ్యింది ఈషా. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈషాను చూసి అందమే అసూయ పడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.




