AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Prakash : ఈ పవర్ ఫుల్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరడు గట్టిన విలన్ పాత్రల్లో ఒదిగిపోయి నటులు చాలా మందే ఉన్నారు. అందులో సత్య ప్రకాశ్ ఒకరు. తన భయంకరమైన విలనిజంతో 'సైకో సత్య'గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారాయన. రూపు చూస్తే సత్య ప్రకాశ్ ఉత్తరాది వారేమో అనుకుంటారు చాలా మంది.

Satya Prakash : ఈ పవర్ ఫుల్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Satya Prakash
Rajitha Chanti
|

Updated on: Aug 15, 2024 | 9:27 PM

Share

సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తే.. ప్రేక్షకులు కూడా భయపడేలా, అసహ్యించుకునేలా ఉండాలి. అప్పుడే విలన్ పాత్రలకు తగిన గుర్తింపు వస్తుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరడు గట్టిన విలన్ పాత్రల్లో ఒదిగిపోయి నటులు చాలా మందే ఉన్నారు. అందులో సత్య ప్రకాశ్ ఒకరు. తన భయంకరమైన విలనిజంతో ‘సైకో సత్య’గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారాయన. రూపు చూస్తే సత్య ప్రకాశ్ ఉత్తరాది వారేమో అనుకుంటారు చాలా మంది. కానీ ఆయన మన తెలుగు వాడే. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో పుట్టారు. అయితే ఒడిశాలో పెరిగాడు. కెరీర్ ప్రారంభంలో కొద్దిరోజుల పాటు ఓ బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అన్నట్లు సత్య ప్రకాశ్ అసలు పేరు ‘ వెంకట సూర్య సత్యనారయణ సోమయాజులు ప్రసాద్’.

సినిమాల్లోకి వచ్చక సత్య ప్రకాష్ గా పేరు మార్చుకున్నారు. సినిమా అవకాశాల కోసం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ముంబై వెళ్లిన సత్య అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సత్య ఓ కన్నడ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరి మన్ననలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. కన్నడతో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Saty Prakash New

Saty Prakash New

ఇక తెలుగులో సత్య ప్రకాశ్ నటించిన మొదటి చిత్ర జైత్ర యాత్ర. ఆతర్వాత 1995లో మోగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం విలన్ గానే కాకుండా నటుడిగా, కమెడియన్ గానూ అదరగొట్టారీ ట్యాలెంటెడ్ యాక్టర్. రసింహనాయుడు, మాస్టర్, ఎదురులేని మనిషి, సీతారామ రాజు, సీతయ్య, పోకిరి, లక్ష్మీ తదితర సినిమాల్లో సత్య ప్రకాశ్ పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఓవరాల్ గా 11 భాషల్లో సుమారు 500కి పైగా సినిమాల్లో నటించారు సత్య ప్రకాశ్. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు కూడా కానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇక చివరిసారిగా ఆ ఏడాది రిలీజైన ఆదిపర్యంలో ఒక కీలక పాత్ర పోషించారు సత్య ప్రకాశ్‌. అయితే గతంలోలా ఆయన ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. అయితే ఈ మధ్యన కొన్ని ఇంటర్వ్యూల్లోనూ కనిపిస్తున్నారీ ఫేమస్ విలన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్