Aay Movie Review: ఆయ్ మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ బావమరిది సినిమా హిట్టయ్యిందా..?

మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్.. ఇప్పుడు ఆయ్ అంటూ వచ్చేసారు. కొత్త దర్శకుడు అంజి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Aay Movie Review: ఆయ్ మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ బావమరిది సినిమా హిట్టయ్యిందా..?
Aay Movie
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 15, 2024 | 9:08 PM

మూవీ రివ్యూ: ఆయ్

నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, అంకిత్, కసిరెడ్డి, వినోద్ కుమార్ తదితరులు

ఎడిటర్: కోడాటి పవన్ కళ్యాణ్

సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి

సంగీతం: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ

నిర్మాతలు: బన్నీవాసు, విద్యా కొప్పినీడి

స్క్రీన్ ప్లే, దర్శకుడు: అంజి కె.మణిపుత్ర

మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్.. ఇప్పుడు ఆయ్ అంటూ వచ్చేసారు. కొత్త దర్శకుడు అంజి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:

బూరయ్య (వినోద్ కుమార్) కొడుకు కార్తీక్ (నార్నే నితిన్) కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఊరికి వచ్చేస్తాడు. ఆయనొచ్చిన విషయం తెలిసి ఫ్రెండ్స్ హరి (అంకిత్ కొయ్య), సుబ్బు (కసిరాజు) కూడా దిగుతారు. చిన్నప్పటి నుంచి తన స్నేహితుల కారణంగా అన్నీ తిప్పలు పడే కార్తీక్.. వాళ్ళ నుంచి తప్పించుకు తిరుగుతుంటాడు. అదే సమయంలో ఊళ్ళో పల్లవి (నయన్ సారిక)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ అదే అమ్మాయిని ఫ్రెండ్ సుబ్బు ఐదేళ్లుగా ప్రేమిస్తుంటాడు. కానీ పల్లవి మాత్రం కార్తిక్‌ను ప్రేమిస్తుంది.. కానీ కులం వేరు అనే కారణంతో తండ్రి దుర్గ (మైమ్ గోపీ) చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. కులం, స్థాయి కారణంగా ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని కార్తీక్ బాధ పడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? కొడుకు బాధను తీర్చేందుకు బూరయ్య ఏం చేస్తాడు అనేది అసలు కథ..

కథనం:

రెండు కోతులు కొట్లాడుకుంటే.. మధ్యలో సైలెంట్‌గా పిల్లి వచ్చి రొట్టెముక్క లాక్కెళ్లిపోయిందంట..! ఈ కథ గుర్తుందా.. ఈ ఆగస్ట్ 15కి ఇదే జరిగేలా కనిపిస్తుందిప్పుడు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌పై అందరి ఫోకస్ ఉంటే.. ఆయ్ అంటూ వచ్చి కలెక్షన్లు అన్నీ పట్టుకెళ్లేలా ఉంది ‘ఆయ్’. నిజానికి ముందు నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అండర్ డాగ్‌గానే తమ సినిమాను తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. ఇదేం సూపర్ సినిమా కాదు.. కొత్త కథేం కాదు.. కానీ ఉన్నంతలో బెటర్ సినిమా.. అక్కడక్కడా కామెడీ పేలిన సినిమా. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. జాతిరత్నాలు తరహాలోనే కథ ఉండదు.. కామెడీ తప్ప. సెకండాఫ్‌లోనూ అక్కడక్కడా నవ్వులు బాగానే కురిసాయి.. కథ కంటే కామెడీ ఎపిసోడ్స్‌పై ఫోకస్ చేసాడు దర్శకుడు అంజి. ఈ కామెడీతోనే అండర్ కరెంట్‌గా కులం టాపిక్ తీసుకొచ్చాడు. కులం చుట్టూనే ఈ కథను రాసుకున్నాడు. చివర్లో అదే కులానికి ముడిపెట్టి.. చిన్న ట్విస్టుతో రెగ్యులర్ ఎండింగ్ ఇచ్చారు. రిస్క్ అని తెలిసినా కూడా చాలా వరకు కులం టాపిక్ బాగానే తీసుకొచ్చాడు దర్శకుడు. అంతేకాదు.. ఏపీలో గత ప్రభుత్వంపై.. వాలంటీర్ వ్యవస్థపై కూడా పంచులు రాసుకున్నాడు. దాంతో పాటు మరికొన్ని సీన్స్ కూడా బాగానే పేలాయి. క్లైమాక్స్ చాలా బాగుంటుందని ముందు నుంచి హైప్ ఇచ్చారు.. అయితే అక్కడ చూస్తే అంతగా ఏం అనిపించదు. రెగ్యులర్ ఎండింగ్ ఇచ్చారు కాకపోతే అప్పటి వరకు సినిమా రేసీగా వెళ్తుంది కాబట్టి పెద్దగా కంప్లైంట్స్ లేకుండానే థియేటర్ నుంచి బయటికి వచ్చేస్తాం..

నటీనటులు:

నార్నె నితిన్ బాగున్నాడు.. బాగా నటించాడు కూడా. మ్యాడ్ సినిమాతో పోలిస్తే ఇందులో ఇంకాస్త మెరుగయ్యాడు. డాన్సులు కూడా బాగానే చేసాడు. హీరోయిన్ నయన్ సారిక ఓకే. ఆమె నటన బాగుంది. హీరో ఫ్రెండ్స్‌గా అంకిత్ కొయ్య, కసిరెడ్డి కామెడీ అదిరిపోయింది.. అదే మేజర్ ప్లస్ పాయింట్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ క్లైమాక్స్‌లో అద్భుతంగా చేసాడు. చిన్న పాత్రే అయినా మైమ్ గోపీ బాగున్నాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

ఆయ్ సినిమాకు మేజర్ హైలైట్ సంగీతం.. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ చాలా బాగుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించినా బోర్ అయితే కొట్టవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఊరి అందాలు అద్భుతంగా చూపించారు. దర్శకుడు అంజి కామెడీ సినిమా చేసినా.. కులం లాంటి రిస్కీ టాపిక్ టచ్ చేసాడు. అయితే కథలో అదే హైలైట్ అవ్వకుండా కామెడీతో కవర్ చేసాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఆయ్.. కామెడీ పర్లేదండోయ్.. ‘ఆయ్..’

ఆయ్ మూవీ రివ్యూ..
ఆయ్ మూవీ రివ్యూ..
ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ఐదుగురు మృతి.. మరో
ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ఐదుగురు మృతి.. మరో
హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం
హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం
‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం
‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం
ఆ జిల్లాలో ఎయిమ్స్ వైద్యశాల.. అప్పటి నుంచే పూర్తి వైద్యం..
ఆ జిల్లాలో ఎయిమ్స్ వైద్యశాల.. అప్పటి నుంచే పూర్తి వైద్యం..
ఏపీలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు.. టోకెన్ తీసుకుని భోజనం చేసిన
ఏపీలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు.. టోకెన్ తీసుకుని భోజనం చేసిన
సింహం బారి నుంచి ఎలా తప్పించుకున్నారు? ఓటీటీలో  సూపర్ హిట్ మూవీ
సింహం బారి నుంచి ఎలా తప్పించుకున్నారు? ఓటీటీలో  సూపర్ హిట్ మూవీ
స్నాక్‌కి బెస్ట్ రెసిపీ.. క్రిస్పీ పెసర పునుగులు..
స్నాక్‌కి బెస్ట్ రెసిపీ.. క్రిస్పీ పెసర పునుగులు..
సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌
సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌
వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా అదే..
వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా అదే..
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?