AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garividi Lakshmi OTT: ఓటీటీలో రీసెంట్ సూపర్ హిట్ ‘గరివిడి లక్ష్మి’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

దసరా కానుకగా రిలీజైన గరివిడి లక్ష్మి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జనాలు ఈ సినిమాను ఎగబడి చూశారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ రియల్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

Garividi Lakshmi OTT: ఓటీటీలో రీసెంట్ సూపర్ హిట్ 'గరివిడి లక్ష్మి'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Garividi Lakshmi
Basha Shek
|

Updated on: Nov 08, 2026 | 4:56 PM

Share

ఈ ఏడాది దసరాకు చాలా సినిమాలే వచ్చాయి. రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి వంటి పెద్ద సినిమాలతో పాటు అనుపమా పరమేశ్వరన్ క్రేజీ కల్యాణం, ఆనంది గరివిడి లక్ష్మి వంటి సినిమాలు కూడా ఆడియెన్స్ ను అలరించాయి. అయితే వీటిలో గరివిడి లక్ష్మి అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రాణం పోసిన దిగ్గజ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగమ్మాయి ఆనంది లీడ్ రోల్ లో నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. జైలర్ 2, రణబాలి వంటి స్టార్ హీరోల సినిమాలను తట్టుకుని మరీ మంచి కలెక్షన్లు రాబట్టింది. గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించిన గరివిడి లక్ష్మి సినిమాలో ఆనంది టైటిల్ రోల్ పాత్రలో అద్బుతంఆ నటించింది. అలాగే ఆమెతల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రాశి తన యాక్టింగ్ తో మెప్పించారు. వీరితో పాటు వీకే నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గరివిడి లక్ష్మి ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది.

గరివిడి లక్ష్మి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం. ఈనేపథ్యంలో ఈ శుక్రవారం (నవంబర్ 13) నుంచే ఆనంది సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇక గరివిడి లక్ష్మి సినిమా విషయానికి వస్తే.. పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్‌, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్లలో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మి జీవితం ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్లను ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలాగే 1977ల నాటి ఉత్తరాంధ్ర పల్లెటూరి వాతావరణాన్ని, యాసను, భాషను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చిత్రించారు. అప్పటి రంగస్థల మహిళా కళాకారులు ఎదుర్కొన్న అవమానాలు, వివక్షను కూడా ఇందులో చూపించారు డైరెక్టర్.

గ‌రివిడి ల‌క్ష్మి సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us