AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuvvu Naku Nachav : ఏంటీ.. ఆశ ఇలా మారిపోయావ్.. నువ్వు నాకు నచ్చావ్ మూవీ బ్యూటీ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన ముద్దుగుమ్మలు.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తారలు.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తారలు తిరిగి అడియన్స్ ముందుకు వస్తున్నారు.

Nuvvu Naku Nachav : ఏంటీ.. ఆశ ఇలా మారిపోయావ్.. నువ్వు నాకు నచ్చావ్ మూవీ బ్యూటీ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
Flora Saini
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2025 | 6:45 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ ఆమె నటించిన చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఒకప్పుడు బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన ఈ అమ్మడు..ఇప్పుడు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె పేరు ఫ్లోరా సైనీ. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు కానీ.. వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ ఆశ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

ఇవి కూడా చదవండి

వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లేతోపాటు డైలాగ్స్ రాశారు. 2001లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. అప్పట్లనే రూ.18.04 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ స్నేహితురాలు ఆశ పాత్రలో నటించిన ఫ్లోరా సైనీ. ఇందులో కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్లోరా సైనీ.. సినిమాల్లోకి మయూరిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఆషా సైనీగా మారింది. రాజశేఖర్ నటించిన మనసున్న మారాజు సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

అలాగే జగపతి బాబు, సౌందర్య కలిసి నటించిన సర్దుకుపోదాం రండి, శ్రీకాంత్ నటించిన ఓ చినదాన, 143 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలకృష్ణతో కలిసి నటించిన లక్స్ పాప పాటతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే వరుస పోస్టులతో నెటిజన్ల ముందుకు వస్తుంది. అయితే ఇదిలా ఉంటే.. త్వరలోనే స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9లో ఈ అమ్మడు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా తెలియరాలేదు. ప్రస్తుతంఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

View this post on Instagram

A post shared by Flora Saini (@florasaini)

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..