Farmers: రైతులందరూ పండగ చేసుకునే న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయ్..
ఏపీలోని రైతులు పండగే. ఈ మేరకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించనుంది. రాష్ట్రంలోని రైతులందరికీ ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. ఇక నుంచి రైతులకు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతులు తమ ధాన్యం విక్రయించిన వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటివరకు ధాన్యం అమ్మిన కేవలం 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు విడుదల చేసేవారమని వెల్లడించారు. ఇంతకుమందు ధాన్యం విక్రయించిన తర్వాత రైతులు వారాల పాటు ఎదురుచూడాల్సిన అవసరం ఉండేదని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదన్నారు. ఇప్పటి నుంచి ధాన్యం అమ్మిన రోజే డబ్బులు ఇస్తామని తెలిపారు. ఉదయం ధాన్యం విక్రయిస్తే సాయంత్రం కల్లా రైతుల అకౌంట్లోకి తప్పనిసరిగా డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఈ కొత్త నిర్ణయం ఊరట కలిగిస్తోంది. ఇక నుంచి సేకరణ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయనేది రైతులు ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేదు. ధాన్యం విక్రయించాక రైతుల బ్యాంకు వివరాలను అధికారులు తీసుకుంటారు. అనంతరం ఆ బ్యాంక్ అకౌంట్‌లో నిధులు జమ చేస్తారు.
రైతుల కోసం ప్రత్యేక రైలు
ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు 6 లక్షల 83 వలే 623 మంది రైతుల అకౌంట్లలో రూ.9,890 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతుల నుంచి రబీ సీజన్‌లో పండిన ధాన్యం సేకరించేందుకు అన్నీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో ఇందుకు అవసరమైన టెక్నాలజీ ఉపయోగించుకనేలా సిబ్బంది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల ధాన్యం తరలించేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామని, చరిత్రలో ఇందుకు స్పెషల్ రైలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. రబీ సీజన్‌లో రైతులకు గోతాలు, ఇతర సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు నాదెండ్ల మనోహర్ పేర్నొన్నారు.
కొనసాగుతున్న ఖరీఫ్ ధాన్యం సేకరణ
గుంటూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ కొనసాగుతున్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జీపీఎస్, తేమ శాతం, రవాణా సౌకర్యాలు సమర్థంగా తమ ప్రభుత్వం అధిగమించిందన్నారు. తాజాగా విజయవాడలో పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, రైతులకు నిధుల విడుదలపై చర్చించారు. అనంతరం ధాన్యం అమ్మిన రోజే రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై ఏపీలోని రైతలుందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
