AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar : స్టార్ హీరో కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు.. అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం జరిగింది. ముంబైలో ఆయన భార్యతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కారు ఒక ఆటో రిక్షాను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్షయ్ కుమార్ దంపతులు క్షేమంగా బయటపడగా.. ఆటో రిక్షా తీవ్రంగా ధ్వంసమైంది. అక్షయ్ కుమార్ దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు.

Akshay Kumar : స్టార్ హీరో కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు.. అసలేం జరిగిందంటే..
Akshay Kumar
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2026 | 6:57 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ముంబైలోని జుహు ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 8:45, 9 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో విమానాశ్రయం నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జుహులోని గాంధీగ్రామ్ రోడ్ ఇస్కాన్ టెంపుల్ ప్రాంతంలో వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు ఒక ఆటోరిక్షాను ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆటో రిక్షా తీవ్రంగా ధ్వంసమైంది. అలాగే ఈ ఘటనలో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే, సంఘటన స్థలంలో గందరగోళం చెలరేగింది.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

ఈ ప్రమాదంలో ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమైంది. ఆటో రిక్షా డ్రైవర్, ప్రయాణీకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిద్దరిని వెంటనే సమీపంలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటన గురించి సమాచారం అందుకున్న ముంబై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా అధికారిక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కానీ పోలీసులు మెర్సిడెస్ డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ విషయంపై అక్షయ్ కుమార్ ఇప్పటివరకు స్పందించలేదు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

ప్రమాదం జరిగిన కారు అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనం అని భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి, వీటి వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అక్షయ్ కుమార్ నటిస్తోన్న వెల్కమ్ టు ది జంగిల్ మూవీ ఈ ఏడాది విడుదల కానుంది.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..