Bheemili Movie: సినిమాలు మానేసి.. పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్న హీరోయిన్.. నానితో నటించిన ఈ అమ్మడు గుర్తుందా..?
చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. తెలుగులో చేసింది ఒకటి రెండు సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. కానీ కొందరు హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోతుంటారు. ఆ తర్వాత కూడా బయట పెద్దగా కనిపించరు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఇంతకీ ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

తెలుగు సినీరంగంలో న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. సహజ కంటెంట్.. ఫ్యామిలీ ప్రేక్షకులను కట్టిపడేసే కథనాలతో థియేటర్లలో సందడి చేస్తుంటారు నాని. ఎక్కువగా పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ తనదైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంటారు. ఇటీవల కాలంలో విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నారు నాని. ముఖ్యంగా మాస్, యాక్షన్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దసరా సినిమాతో మాస్ హీరోగా మెప్పించిన నాని.. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో తండ్రి పాత్రలో అద్భుతమైన నటనతో మరోసారి మనసులను గెలుచుకున్నారు. ఇక ఇటీవలే హిట్ 3 సినిమాలో మాస్ యాక్షన్ హీరోగా బాక్సాఫీస్ షేక్ చేశారు. ప్రస్తుతం నాని నటించనున్న అప్ కమింగ్ మూవీస్ పై మరింత హైప్ పెరిగింది.
ఇదిలా ఉంటే.. నాని నటించిన చిత్రాల్లో భీమిలి కబడ్డీ జట్టు ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నాని. తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా 2010లో విడుదలైంది. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పల్లెటూరి కుర్రాడిగా కనిపించారు నాని. ఇందులో నాని సరసన మలయాళీ హీరోయిన్ శరణ్య మోహన్ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించింది శరణ్య.
అలాగే తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో కనిపించింది. తెలుగులో కృష్ణుడు హీరోగా నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమాతోపాటు హ్యాపీ హ్యాపీగా, కత్తి వంటి చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా స్టార్ హీరోలకు చెల్లిగా కనిపించింది శరణ్య. ఆ తర్వాత ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు. 2015లో తన చిన్ననాటి స్నేహితుడు వైద్యుడు అరవింద్ కృష్ణన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శరణ్య.. ప్రస్తుతం శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది. అలాగే పిల్లలు సంగీత పాఠాలు చెబుతుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ శాస్త్రీయ సంగీతం, నృత్యం వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..
