AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhinay Kinger: అప్పట్లో తోపు హీరో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి దీనస్థితిలో.. ఎక్కువ రోజులు బతకనంటూ..

ఒకప్పుడు తమ నటనతో సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుని.. అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమైన తారలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో స్టార్ స్టేటస్ ఉన్న నటీనటులు ఇప్పుడు ధీనస్థితిలో బతుకుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాలం వెల్లదిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

Abhinay Kinger: అప్పట్లో తోపు హీరో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి దీనస్థితిలో.. ఎక్కువ రోజులు బతకనంటూ..
Abhinay Kinger
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2025 | 7:20 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా..? ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అలరించిన ఈ హీరోకు అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ నటుడు.. ఇప్పుడు ఊహించని స్థితిలో కనిపించారు. అనారోగ్యంతో బాధపడుతుూ పూర్తిగా బక్కచిక్కిపోయి.. ఆర్థిక సమస్యలతో చిన్న ఇంట్లో ఉంటున్నారు. ఆ హీరో మరెవరో కాదు.. అభినయ్ కింగర్. మలయాళీ చిత్రపరిశ్రమలో టాప్ హీరో. సీనియర్ నటి టీ.పీ. రాధామణి కొడుకే అభినయ్. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ కావడంతో చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఏర్పడింది. తళ్లుల్లువో ఇళమై సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు.

ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..

ఆ తర్వాత జంక్షన్ అనే తమిళ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సక్సెస్ దాస్, పొన్ మేఘలై, సొల్ల సొల్ల ఇనిక్కుం, అరుముగం, ఆరోహణం వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. 2014 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నాడు. చివరగా వల్లవణుక్కు పుళ్లుం ఆయుధం సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. సినిమాలతోపాటు పలు వాణిజ్య ప్రకటనలలోనూ కనిపించారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు పదేళ్లుగా ఏ సినిమాలో నటించలేదు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..

హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అభినయ్.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. అలాగే అనారోగ్య సమస్యలు సైతం వేధిస్తున్నాయి. చిన్న ఇంట్లో ఉంటూ.. ప్రభుత్వం నడిపే క్యాంటీన్ లో తింటూ బతుకు నెట్టుకొస్తున్నాడు. కొన్ని రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. తాజాగా తమిళ కమెడియన్ కేపీవై బాలా అభినయ్ ను కలిసి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. తనకు కాలేయ వ్యాధి మరింత ముదిరిందని.. ఇంకా ఏడాది మాత్రమే తాను బతుకుతానని ఎమోషనల్ అయ్యారు. దీంతో బాలా అతడికి ధైర్యం చెబుతూ.. తప్పకుండా వ్యాధి నయమవుతుందని.. మళ్లీ సినిమాలు చేస్తావు అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..