అలా వచ్చి ఇలా మాయమైంది.. కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయ్యింది.. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో తెలుసా..
సినిమా హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటారు అభిమానులు. కాగా తెలుగులో చాలా మంది ముద్దుగుమ్మలు ఇలా వచ్చి అలా మాయమైన వారే.. కొంతమంది మాత్రమే ఇక్కడ హీరోయిన్స్ గా సెటిల్ అయ్యారు. చాలా మంది ఇప్పుడు కనిపించకుండా మాయమయ్యారు.
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే మెప్పించారు. కొంతమంది హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే ఓ హీరోయిన్ కూడా చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల దగ్గరయింది. ఇలాంటి లవర్ కదా మనకు కావాల్సింది అని కుర్రాళ్లంతా అనుకునేలా చేసింది. తన అందం, హావభావాలు కుర్రాళ్ళ గుండెల్లో అలా ప్రింట్ అయ్యాయి. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? అందంలో ఐశ్వర్యారాయ్ తో పోటీపడిన భామ ఆమె.. తెలుగులో సక్సెస్ లు సాధించిన అనుకున్నంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. కానీ అక్కడ కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాతోనే టైం పాస్ చేస్తుంది. ఆమె మరెవరో కాదు..
ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ
పై ఫొటోలో ఉన్న బ్యూటీ మరెవరో కాదు క్రేజీ భామ.. ఉల్లాసంగా ఉత్సహంగా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ స్నేహా ఉల్లాల్. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది. అంతకు ముందు భవనమ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మడతకాజా అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక సుశాంత్ హీరోగా నటించిన కరెంట్ సినిమాలో చేసింది. ఈ మూవీ యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాకు డీఎస్పీ అందించిన సంగీతం విశేషంగా ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి
అలాగే కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2008లో వచ్చిన ఈ మూవీ తర్వాత స్నేహ ఉల్లాల్ మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా.? సినిమాలో చేసింది. ఈ సినిమా కూడా పర్లేదు అనిపించుకుంది. అయితే ఆతర్వాత స్నేహ తెలుగులో నటించలేదు. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడకూడా ఈ అమ్మడికి అంతగా ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు, సిరీస్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.