AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భార్యను వేధిస్తున్నాడని వెతుక్కుంటూ వచ్చి దాడి.. తీరా అసలు నిజం తెలిశాక..!

హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళను వేధిస్తున్నాడని, ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తిని చితకబాదారు నలుగురు దుండుగులు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Hyderabad: భార్యను వేధిస్తున్నాడని వెతుక్కుంటూ వచ్చి దాడి.. తీరా అసలు నిజం తెలిశాక..!
Man Attacked
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 20, 2024 | 6:28 PM

Share

తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి ఇంకో వ్యక్తిపై దాడి చేశాడు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితిలో అలా అనిపించడం సహజం. పైగా సొంత వారిని వేధింపులకు గురి చేశారని తెలిస్తే కొన్ని సార్లు చంపడానికి కూడా వెనకాడరు కొందరు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి అదే ఆవేశంలో తన భార్యను వేధిస్తున్నాడని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడి చేశారు. కానీ, అక్కడ అవతలి వ్యక్తి అసలైన నిందితుడు కాదు.. ఒకరిని అనుకుని మరొకరిపై దాడి చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్బీ ప్రాంతంలోని ధర్మారెడ్డి కాలనీలో ఉన్న ఓ హాస్టల్‌లో గాలి వరప్రసాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి ఓ యువతి, ముగ్గురు వ్యక్తులు ధర్మారెడ్డి కాలనీలోని హాస్టళ్లలో గాలిస్తూ చివరికి ఈ వరప్రసాద్ ఉంటున్న హాస్టల్ వద్దకు వచ్చారు. ఇక్కడ వరప్రసాద్ ఎవరైనా ఉన్నారా అని వారు ప్రశ్నించగా.. గాలి వరప్రసాద్, తానే వరప్రసాద్ అని బయటకు రాగానే ఆ ముగ్గురు వ్యక్తులు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఎందుకు, ఏమిటీ అని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా దాడి చేయడంతో మొదట అతనికి ఏమీ అర్థం కాలేదు. తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ రక్తసిక్తం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వచ్చిన ఆ నలుగురిని విచారించగా అసలు విషయం బయటపడింది. దాడి చేసిన వ్యక్తులు వేరే ఎవరో వరప్రసాద్ కోసం వచ్చి, తప్పుగా గాలి వరప్రసాద్‌పై దాడి చేసినట్లు గుర్తించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ఇష్టారీతిన ఒక వ్యక్తిపై దాడికి పాల్పడినందుకు ఆ నలుగురిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం