ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోనున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు జరుపుకునే పండుగలలో ఇది ముఖ్యమైనది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో దీనిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ సమయంలో, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఒకరికొకరు బహుమతులు పంచుకుంటారు. అందమైన అలంకరణలు, మెరిసే దీపాలతో క్రిస్మస్ జరుపుకుంటారు.