AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షాలు నడుపుకుంటున్నారు.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై దాడులు జరగడం.. ఆలయాలను అపవిత్రం చేయడం, కూల్చి వేసిన వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి అని ప్రజలను తాను అడిగితే.. ఈరోజు ఔరంగ జేబు కుటుంబమే సాక్షం అని అంటున్నారు. ఈ రోజు ఔరంగజేబు వారసుడు కోల్‌కతా దగ్గర రిక్షాలు నడుపుతున్నారడని.. దీనికి కారణం అతను దేవాలయాలను కూల్చివేసి, పాడు చేయడమే.. లేదంటే అతను ఈ రోజు ఈ దుస్థితికి చేరుకునే అవసరం ఉండేది కాదని అంటున్నారు.

అందుకే ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షాలు నడుపుకుంటున్నారు.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
Cm Yogi Adityanath
Surya Kala
|

Updated on: Dec 20, 2024 | 6:45 PM

Share

సనాతన ధర్మం ప్రాముఖ్యత గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ సనాతన ధర్మం సురక్షితంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని అన్నారు. ఆపద సమయంలో ప్రతి వర్గానికి.. మతానికి ఆశ్రయం కల్పించిన ఏకైక మతం సనాతన ధర్మం అని చెప్పారు. అయితే ఇలా హిందువులకు ఎప్పుడైనా ఆశ్రయం ఇవ్వడం జరిగిందా అనడమే కాదు.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో, అంతకు ముందు పాకిస్థాన్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు.

అయోధ్యలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘దేశంలోని సనాతన ధర్మానికి గర్వకారణమైన స్థలాలను ధ్వంసం చేసిన వ్యక్తులు ఎవరు? ఎందుకు అలా చేశారని తాను అడగాలనుకుంటున్నానని అన్నారు. అంతెందుకు ఇలాంటి ధ్వసం వెనుక వారి ఉద్దేశం ఏమిటంటే.. ఇలాంటి అనాగరిక చర్యల ద్వారా మొత్తం భూమిని నరకం చేయాలనే కుట్రలో ఒక భాగం అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

దేవాలయాలను కూల్చివేస్తే రాజవంశమే నాశనం అవుతుంది: సీఎం యోగి

ఆలయాల కూల్చివేతలను ప్రస్తావించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ .. కొన్నిసార్లు కాశీలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని, కొన్నిసార్లు అయోధ్యలోని రామజన్మభూమిని, కొన్నిసార్లు మథురలోని శ్రీకృష్ణ జన్మభూమిని, కొన్నిసార్లు సంభాల్‌లోని కల్కి అవతారానికి చెందిన హరిహర భూమిని, కొన్నిసార్లు భోజ్‌లోని ఆలయాన్ని ధ్వంసం చేశారు. అన్ని సమయాలలో హిందూ దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఈ దేవాలయాలను కూల్చివేయడం ద్వారా వారి వంశం నాశనం అయింది. రక్తపాతం జరిగింది. నేటికీ వారి వారసులు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారని చెప్పారు.

సిఎం యోగి ఇంకా మాట్లాడుతూ.. ఆలయాన్ని కూల్చివేసిన వారి కుటుంబాల పరిస్థితి ఏంటని తాను ఎప్పుడైనా ప్రజలను అడిగితే.. వెంటనే ఔరంగజేబు కుటుంబం గురించి చెబుతున్నారని.. ఇప్పుడు అతని వారసులు కోల్‌కతా సమీపంలో రిక్షాలు నడుపుకుంటూ జీవిస్తున్నారని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఒకవేళ ఔరంగజేబు వంశస్తులు కనుక దేవాలయాలను కూల్చివేయకుండా, పాడుచేయకుంటే ఉండి ఉంటే ఈరోజు వారి వారసులకు ఇలాంటి దుస్థితి ఏర్పడేది కాదని చెప్పారు.

మానవ నాగరికతకు సనాతన సంస్థ అవసరం: సీఎం యోగి

దేవాలయాలను అపవిత్రం చేసే వారు, వారి వారసులు నాశనం చేయబడతారు. కాలక్రమంలో ఇబ్బందులు పడతారు. సనాతన ధర్మం మాత్రమే ప్రపంచ శాంతిని నెలకొల్పగలదని అన్నారు.

సనాతన గురించి సీఎం యోగి ఇంకా మాట్లాడుతూ.. “ప్రపంచ మానవ నాగరికత కాపాడబడాలంటే సనాతనాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు. వసుదేక కుటుంబము గురించి వేల సంవత్సరాల క్రితం మన ఋషులు, మునులు చెప్పినది నేటికీ వర్తిస్తుందన్నారు. విపత్తు సమయంలో ప్రతి వర్గానికి, మతానికి ఆశ్రయం కల్పించిన ఏకైక మతం సనాతన ధర్మం. అయితే ఇలా హిందువులకు ఎప్పుడైనా ఆశ్రయం దొరికిందా..అది బంగ్లాదేశ్‌లో నైనా, పాకిస్థాన్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లోనైనా సరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..