World Saree Day 2024: భారతదేశంలోని ఈ 5 రకాల చీరలు కారు కంటే ఖరీదైనవి.. ధర వింటే షాక్ అవుతారు

చీరలు భారతీయ సంప్రదాయం,సంస్కృతిలో ఒక భాగం. చాలా మంది మహిళలు ప్రతి రోజూ చీరలు ధరిస్తే.. నేటి తరం యువత ఎంత ఆధునిక దుస్తులను ఇష్టపడినా పండగ, పర్వదినాలు లేదా ప్రత్యేక సందర్భాలు వస్తే చాలు తప్పనిసరిగా చీర ధరిస్తారు. ఈ నేపధ్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ చీరల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశంలోని 5 అత్యంత ఖరీదైన చీరల గురించి తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Dec 20, 2024 | 5:32 PM

భారతీయ చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. చీర అనేది సాంప్రదాయ వస్త్రం మాత్రమే కాదు.. భారతీయ మహిళల అందం, గౌరవం, గుర్తింపుకు చిహ్నం. కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా సాంప్రదాయ చీర లో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మార్కెట్ లో చాలా వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు విదేశీ మహిళలు కూడా చీర అంటే ఆసక్తిని చూపిస్తున్నారు. చీర కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ చీరల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న జరుపుకుంటున్నారు.

1 / 7
చీరల ప్రత్యేకత వాటిని తయారు చేసే కళాకారుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీల వరకు అందరి వార్డ్‌రోబ్‌లో రకరకాల చీరలు ఖచ్చితంగా ఉంటాయి. కనుక ఈ ప్రత్యేకమైన  సందర్భంలో భారతదేశంలోని అత్యంత ఖరీదైన చీరల గురించి తెలుసుకుందాం. ఈ చీరల ధర వింటే ఎవరైనా షాక్ తినాల్సిందే.. ఎందుకంటే చీర ఖరీదు కారు కంటే ఎక్కువగా ఉంటుంది.

2 / 7
కాంచీపురం చీర: తమిళనాడులోని కంచి అనే ప్రాంతంలో కాంచీపురం చీరలు తయారు అవుతాయి. ఈ చీరలు అత్యుత్తమ పట్టు, అద్భుతమైన పనితనానికి ప్రసిద్ధి చెందాయి. ఈ చీరలకు బంగారం లేదా వెండి దారంతో ఎంబ్రాయిడరీ చేస్తే వీటి ధర లక్షలకు చేరుతుంది. కాంచీపురం పట్టు చీరల ధర రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఉంది.

3 / 7
పటాన్ పటోలా చీర: గుజరాత్‌కు చెందిన ఈ చీర భారతదేశంలోని అత్యంత ఖరీదైన చీరలలో ఒకటి. ఈ పటోలా చీర గుజరాత్‌లోని పటాన్‌లో తయారు చేస్తారు. ఈ చీర డబుల్ ఇకత్ టెక్నిక్‌తో తయారు చేయబడుతుంది. ఈ చీరను తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ 6 గజాల చీర కోసం వార్ప్ థ్రెడ్‌లపై టై-డైడ్ డిజైన్‌ను సిద్ధం చేయడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. దీని ధర రూ.2 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఒకప్పుడు రాచరికం, కులీన కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ధరించేవారు

4 / 7
బనారసీ చీర: బనారసీ చీర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, ఖరీదైన చీర బ్రాండ్‌లలో ఒకటి. బనారసీ చీరలు బనారస్ (వారణాసి)లో తయారవుతాయి. వీటి తయారీలో పట్టు దారాలు, బంగారం, వెండి తీగలను ఉపయోగిస్తారు. ఈ చీర కట్టుకోవడం వల్ల పూర్తిగా రాయల్ లుక్ వస్తుంది. కొన్ని బనారసీ చీరల ధర రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుంది.

5 / 7
మూంగా డోల పట్టు చీర : మూంగా డోల పట్టు చీర అస్సాం సంప్రదాయ దుస్తులలో ఒకటి. ఈ చీర అందమైన అస్సామీ మోటిఫ్‌లతో అలంకరించబడి ఉంటుంది. ఈ చీర పసుపు, బంగారు రంగులో మెరిసి పోతూ మహిళలను ఆకట్టుకుంటుంది. ఈ చీర ఎన్ని సంవత్సరాలున్నా చెడిపోదు. మార్కెట్‌లో ఈ చీర రూ.2 వేల నుంచి మొదలై రూ.2 లక్షల వరకు పలుకుతోంది.

6 / 7
జర్దోసీ వర్క్ చీర: జర్దోజీ అనేది ఒక రకమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దీనిలో బంగారు ,వెండి దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. పూసలు, సీక్విన్స్ , రాళ్లను కూడా ఇందులో ఉపయోగిస్తారు. జర్దోజీ వర్క్ చీరలను ప్రత్యేకంగా వివాహాలు లేదా ప్రత్యేక వేడుకల కోసం తయారు చేస్తారు. దీని ధర 2 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది.

7 / 7
Follow us