- Telugu News Photo Gallery Cinema photos S.S.Rajamouli Mahesh Babu's ssmb29 latest Update on 20 12 2024
Rajamouli: బాబోయ్.. మరో బాంబ్ పేల్చిన రాజమౌళి
రాజమౌళి గురించి కొన్ని విషయాలు మనం సీరియస్‌గా మాట్లాడుకోవాలి.. వందల కోట్ల బడ్జెట్ పెట్టిస్తూ ఇంత కూడా టెన్షన్ లేకుండా ఎలా ఉంటాడీయన అసలు..? అప్‌డేట్స్ ఇవ్వమంటే ఇవ్వడు గానీ ఆయన మాత్రం ఇలా ఎంజాయ్ చేయొచ్చా చెప్పండి..? అదేంటి సడన్‌గా జక్కన్నపై పడ్డారు అనుకుంటున్నారు కదా..? ఇది మా బాధ కాదండోయ్.. ఎవరిదో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం పదండి..
Updated on: Dec 20, 2024 | 5:16 PM

చూస్తున్నారుగా.. రాజమౌళి డాన్సులు..! ఏ మాటకామాటే హీరోల మాదిరి భలే చేస్తున్నాడు కదా..! ఇప్పుడీ చిందులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఓ వైపు మాకు అప్‌డేట్ అంటుంటే మీరు మాత్రం పెళ్లిలో ఇలా డాన్స్ చేస్తారా అంటూ ఆట పట్టిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఇదే ట్రెండ్ అవుతుంటే.. టైమ్ చూసి RRR డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల చేసారు జక్కన్న. స్టార్ హీరోలతో సినిమాలంటే దర్శకులకు ఒకటే టెన్షన్.. అదే అప్‌డేట్స్..! ఈ విషయంలో అందరూ బాధితులే ఒక్క రాజమౌళి తప్ప. ఫ్యాన్స్ ప్రెజర్ నుంచి తప్పించుకోవడం ఎలా అనే బుక్ ఒకటి జక్కన్నతోనే రాయించాలి.

ఈ సూత్రం రాజమౌళికి తెలిసినట్లు మరెవ్వరికి తెలియదు. తాజాగా ఇదే మాయ చేస్తున్నారు జక్కన్న. కొత్త అప్‌డేట్ చెప్పకుండా.. ట్రిపుల్ ఆర్‌తో ట్రెండ్ అవుతున్నారు. ఏ హీరో అప్‌డేట్ అయినా నెల రోజులు ఆలస్యమైతేనే దర్శకులు తెగ కంగారు పడుతుంటారు. కానీ జక్కన్న ఏ అప్‌డేట్ ఇవ్వకుండానే ఏళ్లకేళ్లు సర్వై అవుతుంటారు.

ఫ్యాన్స్‌ను కూల్ చేస్తుంటారు కూడా. ఇటు SSMB29 ప్రీ ప్రొడక్షన్‌తో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన పర్సనల్ పనులు కూడా చేసుకుంటున్నారీయన. SSMB 29 మొదలైతే రాజమౌళి ట్రెండ్ అవ్వడం మ్యాటరే కాదు.. కానీ అవ్వకుండానే ఈయన ట్రెండ్ అవుతున్నారు.

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తోడైంది. 2025లో షూట్ మొదలు పెట్టి.. 2027లో సినిమా విడుదల చేయాలనేది జక్కన్న ప్లానింగ్. ఇది నిజమే అయితే.. మహేష్ ఫ్యాన్స్‌కు పండగే.




