Tollywood 2025: ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌.. 2025లో విడుదలయ్యే ఈ సినిమాలపై భారీ అంచనాలు

టాలీవుడ్ స్క్రీన్‌కు 2024 సంవత్సరం మంచి జోష్ ఇచ్చిందనే చెప్పాలి. షాకింగ్ డిజాస్టర్ సినిమాలు చాలానే ఉన్నా... ఓవరాల్‌గా 2024 టాలీవుడ్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాయి. పుష్ప 2 గ్రాస్ కలెక్షన్స్ రూ.2,000 కోట్ల వైపుగా పరుగులు తీస్తోంది. అదే జోరు కొత్త ఏడాదిలో కనిపిస్తుందని టాలీవుడ్‌ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. న్యూ ఇయర్‌లో వచ్చే సినిమాల్లో భారీ కలెక్షన్స్ సాధించే సత్తా కలిగిన మూవీస్‌ చాలానే కనిపిస్తున్నాయి.

Tollywood 2025: ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌.. 2025లో విడుదలయ్యే ఈ సినిమాలపై భారీ అంచనాలు
Most Anticipated Tollywood Movies Of 2025
Follow us
Satish Reddy Jadda

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 20, 2024 | 5:28 PM

2024లో టాలీవుడ్ స్క్రీన్‌కు మంచి జోష్ ఇచ్చింది. షాకింగ్ డిజాస్టర్ సినిమాలు చాలానే ఉన్నా… ఓవరాల్‌గా 2024 టాలీవుడ్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చింది. బిగ్ నెంబర్స్‌ను అందించింది. అదే జోరు కొత్త ఏడాదిలో కనిపించబోతోంది.  అప్‌ కమింగ్ సినిమాల లిస్ట్‌లో బిగ్ నెంబర్స్‌ సాధించగలిగే మూవీస్‌ గట్టిగానే కనిపిస్తున్నాయి(Most Anticipated Tollywood Movies 2025).

2025లో అందరికంటే ముందు బరిలో దిగుతున్న సినిమా గేమ్ చేంజర్‌ (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మీద ఇండస్ట్రీ సర్కిల్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపులార్ తరువాత రాం చరణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కావటం, వరుస ఫెయిల్యూర్స్ తరువాత శంకర్‌ చేస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ మీద భారీ హైప్‌ ఉంది.

మెగా పవర్‌ స్టారే కాదు… మెగాస్టార్‌ కూడా క్రేజీ ప్రాజెక్ట్‌తో ఊరిస్తున్నారు. చాలా కాలం తరువాత ఫాంటసీ మూవీ చేస్తున్న చిరు, విశ్వంభర (Viswambhara)గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా… కొడుకు కోసం సైడ్‌ ఇచ్చారు. దీంతో విశ్వంభర రిలీజ్‌ సమ్మర్‌కు షిప్ట్ అయ్యింది.

ఆల్రెడీ సమ్మర్ బరిలో ఉన్న హరి హర వీరమల్లు (Hara Hara Veera Mallu) మీద కూడా బజ్‌ గట్టిగానే ఉంది. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమా ఈ సమ్మర్‌లో బరిలో దిగటం పక్కాగానే కనిపిస్తోంది.

2024లో రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రభాస్‌.. 2025 లో కూడా అదే జోరు కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు. ది రాజాసాబ్‌ (The Raja Saab), ఫౌజీ (Fauji) సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ రెండు సినిమాలను 2025లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

2025లో డబ్బింగ్ సినిమాల జోరు కూడా గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ వార్‌ 2. హృతిక్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద సౌత్‌లో పాటు నార్త్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ ఈ ఏడాది టాక్సిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాల విషయంలో ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

కోలీవుడ్‌లో కూడా క్రేజీ మూవీ క్యూలో ఉన్నారు. విజయ్ ఆఖరి చిత్రంగా రూపొందుతున్న దళపతి 69 మీద ఇప్పటికే నేషనల్‌ లెవల్‌లో బజ్‌ ఉంది. రజనీకాంత్ – లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న కూలీ, అజిత్ హీరోగా తెరకెక్కుతున్న విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ లిస్ట్‌లో ఉన్నాయి. కాంతార కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇవే కాదు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌ మోస్ట్ యాటిసిపేటెడ్‌ లిస్ట్‌లో చేరే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.