Bajaj Chetak: ఐఫోన్‌ కంటే తక్కువ ధరల్లో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 153కి.మీ మైలేజీ!

Bajaj Chetak Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పటికీ నుంచి ఆయా వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకువస్తున్నాయి. ఇందులో ఫోర్‌ వీలర్‌, టూవీలర్‌ వాహనాలు ఉన్నాయి. తాజాగా బజాజ్‌ చేతక్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది..

Bajaj Chetak: ఐఫోన్‌ కంటే తక్కువ ధరల్లో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 153కి.మీ మైలేజీ!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 20, 2024 | 5:00 PM

Bajaj Chetak Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం మరింతగా పెరుగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన తర్వాత వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేశాయి. దీంతో చాలా కంపెనీల నుంచి ఈవీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మరిన్ని టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక చేతక్‌ స్కూటర్‌ గురించి అందరికి తెలిసిందే. ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో బజాజ్‌ చేతక్‌ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది.

ఇక తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. చేతక్‌ 35 సిరీస్‌లో 3501, 3502 పేరిట రెండు వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 3501 అనేది ప్రీమియం మోడల్‌. దీని ధర రూ.1.27 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, బెంగళూరు) కాగా.. 3502 మోడల్‌ ధర రూ.1.20 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. ఇదే సిరీస్‌లో 3503 మోడల్‌ను త్వరలో తీసుకురానున్నారు. అయితే ఐఫోన్‌ ఉన్న ధరల్లో ఈ స్కూటర్‌ ధరలు ఉన్నాయి.

క్లాసిక్‌ లుక్‌తో కొత్త మోడల్‌:

ఇవి కూడా చదవండి

పాత చేతక్‌ ఎలక్ట్రిక్‌ మాదిరిగానే అదే క్లాసిక్‌ లుక్‌తో కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది బజాజ్‌. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్‌ను అమర్చింది కంపెనీ. ఈ స్కూటర్ 73 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో దూసుకెళ్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 153 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీని 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ చేయొచ్చని తెలిపింది. ఇందులో 5 అంగుళాల టచ్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే అందించింది కంపెనీ. ఇందులో మ్యాప్స్‌తో పాటు కాల్‌ ఆన్సర్‌/ రిజెక్ట్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. జియో ఫెన్స్‌, థెఫ్ట్‌ అలర్ట్‌, యాక్సిడెంట్‌ డిటెక్షన్‌, ఓవర్‌స్పీడ్‌ అలర్ట్‌ వంటి భద్రతాపరమైన ఫీచర్లు సైతం ఉన్నాయి.

ఇది కూడా చదవండి: PAN Card: కేవలం రూ.50 చెల్లిస్తే చాలు మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్.. దరఖాస్తు చేయండిలా!

2020 నుంచి బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసింది. ప్రస్తుతం 3201, 3202, 2903, 3201 స్పెషల్‌ ఎడిషన్‌ పేరిట నాలుగు వెర్షన్లను అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 3 లక్షల చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విస్తరణ మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. 5 రూపాయల నాణేల నిలిపివేత.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి