Viral Video: అయ్‌బాబోయ్‌.. ఎంత పే..ద్ద వింత ఆకారం.. చూస్తే గుండెల్లో గుబులు

సోషల్ మీడియాలో తరచూ చాలా రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా సరీసృపాలు, జంతువులకు సంబంధించిన వీడియోలైతే.. నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తారు. అయితే ఇక్కడొక 17 సెకన్ల వీడియోను మీరు చూస్తే గుండె గుబులు రేగడం ఖాయం. ఇంతకీ అదేంటంటే

Viral Video: అయ్‌బాబోయ్‌.. ఎంత పే..ద్ద వింత ఆకారం.. చూస్తే గుండెల్లో గుబులు
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 20, 2024 | 6:30 PM

ఇంటర్నెట్‌లో నిత్యం అనేక వైరల్ వీడియోలు తెగ సందడి చేస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా జంతువులు, సరీసృపాలకు సంబంధించిన వీడియోలు అయితే.. నెటిజన్లు బాగా ఆసక్తిని చూపిస్తుంటారు. సింహం, పులి, చిరుత, మొసలి, కింగ్ కోబ్రా.. ఇలా తమ వేటను బీభత్సంగా వేటాడే క్రూర జంతువులు చాలానే ఉన్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17 సెకన్ల ఈ ఫుటేజ్ ఓల్డ్‌ది అయినప్పటికీ.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలోని కుటై తైమూర్ జిల్లాలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర భారీ నల్లటి ఆకారం దర్శనమిచ్చింది. ఆ ఆకారం సునాయాసంగా గోడలు ఎక్కడమే కాదు.. చెట్ల కొమ్మలు పట్టుకుని ఎంచక్కా పండ్లు తింటోంది. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా.? మరేదో కాదు ఒరంగుటాన్(గొరిల్లా జాతికి చెందినది). ఈ ఒరంగుటాన్ కనిపించిన ప్రాంతం ఏంటన్న దానిపై స్పష్టత లేకపోగా.. అది మగ ఒరంగుటాన్ అని ఈస్ట్ కాలిమంటన్ నేచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ ఏజెన్సీ పేర్కొంది.

సరిహద్దులు, కంచెలు లేనటువంటి ప్రదేశాల్లో ఉండే ఒరంగుటాన్లు.. తరచుగా తమ సహచర ఒరంగుటాన్లు, ఆహరం కోసం నివాస ప్రాంతాలు లేదా రోడ్లపైకి ప్రవేశిస్తాయని ఏజెన్సీ తెలిపింది. కాగా, ఇండోనేషియాలోని సుమత్రా, కాలిమంటన్.. అలాగే మలేషియాలోని సబా, సరవాక్‌లలో ఎక్కువగా ఒరంగుటాన్‌లు కనిపిస్తాయి. పోంగో పిగ్మేయస్, పొంగో అబెలీ, పోంగో తపానులియెన్సిస్ వంటి జాతులు ఒరంగుటాన్‌లలో చాలా రేర్‌గా ఉంటాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: లచ్చిందేవి తలుపు తట్టింది.. బ్యాలెన్స్ చెక్ చేయగా కళ్లు జిగేల్.. కానీ చివరికి.!