Viral: 200 ఏళ్ల నాటి ఫామ్‌హౌస్‌లో మిస్టరీ తలుపు.. తెరిచి చూడగా బిత్తరపోయారు
తమకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఎంతగానో కష్టపడతారు. ఈ జంట కూడా అదే పని చేసింది.. ఇష్టపడి తక్కువకొచ్చింది అని.. ఓ పురాతన బంగ్లా కొన్నారు. తీరా ఆ బంగ్లా కొన్న తర్వాత.. కనిపించింది చూసి వారిద్దరూ దెబ్బకు షాక్ అయ్యారు..
అందరూ తమకు ఇష్టమైన ఇంటిని కొనుగోలు చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడతారు. సరిగ్గా ఈ జంట కూడా తమ ఉద్యోగాల్లో కష్టపడి.. కోట్లు పోసి మరీ ఓ రెండు వందల ఏళ్ల నాటి ఫామ్‌హౌస్ కొన్నారు. ఇలా కొని లోపలికి వెళ్లారో.. లేరో.. వారికి జీవితంలో ఎప్పుడూ ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ అదేంటి.? ఆ స్టోరీ వెనుక మిస్టరీ ఇప్పుడు తెలుసుకుందామా..
అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. విక్కీ లీ అనే మహిళ తన భర్తతో కలిసి తక్కువకొచ్చిందని ఇంగ్లాండ్‌లోని లింకన్‌షైర్‌లో ఓల్డ్ ఫామ్‌హౌస్ ఒకటి కొనుగోలు చేశారు. తీరా ఆ ఫామ్‌హౌస్ 200 ఏళ్ల నాటిది కాబట్టి.. ఆ ఇద్దరు ఇల్లంతా తిరిగి చూశారు. అంతటి పెద్ద రాజభవనం లాంటి ఆ ఇంటిని చూసేసరికి దెబ్బకు స్టన్ అయ్యారు. అయితే వారికి ఈలోగానే ఓ షాక్ తగిలింది. ఫామ్‌హౌస్ లోపల ఓ సీక్రెట్ డోర్ కనిపెట్టారు ఈ జంట. ఆ తలుపు వెనుక ఏం ఉంది.? నిధి నిక్షేపాలు ఏమైన దాచిపెట్టారా.? అనే అనుమానాలతో దాన్ని తెరిచేందుకు ట్రై చేశారు.
పూర్వం నివాసముంటున్న జనాలు తమ డబ్బు, బంగారు ఆభరణాలు, వెండి, నాణేలను దొంగల బారి నుంచి కాపాడుకోవడానికి నేలమాళిగలో దాచిపెట్టేవారు. ఈ జంట కూడా ఆ తలుపు వెనుక బంగారు ఆభరణాలు, వెండి నాణేలు లాంటివి ఉంటాయని తలుపును బద్దలుకొట్టారు. ఇక తలుపు తెరుచుకోగానే.. వారికి ఎదురుగా ఓ రాతి మెట్లతో కూడిన దారి కనిపించింది. ఆ దారి వెంబడి నడుచుకుంటూ వెళ్తే.. పాతకాలం నాటి గోడ చిత్రాలు చాలానే దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
ఇది చదవండి: అయ్‌బాబోయ్.. ఎంత పే..ద్ద వింత ఆకారం.. చూస్తే గుండెల్లో గుబులు