AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇరుగుపొరుగు పిల్లల మధ్య లొల్లి.. చిరిగి చిరిగి చివరకు ఏమైందో చూడండి..! వీడియో

వీధుల్లో ఇరుగు పొరుగు ఇళ్లలోని పిల్లలంతా ఓ చోట చేరి ఆడుకోవడం షరా మామూలే. వీళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం కూడా మామూలే. ఒక్కోసారి పెద్దలు కలుగజేసుకుని పిల్లలకు సర్దిజెప్పి పంపించేస్తారు. అయితే తాజాగా ఇలాంటి గొడవే ఒకటి జరిగింది. ఇక్కడ మాత్రం పిల్లల తల్లిదండ్రులు మాటలతో పరిష్కరించుకోవడానికి బదులు ఏకంగా రోడ్డెక్కి పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు..

Viral Video: ఇరుగుపొరుగు పిల్లల మధ్య లొల్లి.. చిరిగి చిరిగి చివరకు ఏమైందో చూడండి..! వీడియో
Children's Dispute
Srilakshmi C
|

Updated on: Dec 20, 2024 | 7:41 PM

Share

లక్నో, డిసెంబర్‌ 20: సాధారణంగా ఏ ఊరిలోనైనా ఇరుగుపొరుగు పిల్లల మధ్య గొడవలు జరగడం షరా మామూలే. ఒక్కోసారి పెద్దలు కలుగ జేసుకుని పిల్లలకు సర్దిచెబుతుంటారు. దీంతో పిల్లలు మళ్లీ కలిసిపోయి ఆటలాడుకుంటారు. అయితే తాజాగా ఓ గల్లీలో జరిగిన పిల్లల గొడవలు పెద్దలు సిగపట్లు పట్టేదాకా వచ్చాయి. ఇరు వర్గాలు దుమ్ముదుమ్ముగా కొట్టేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో శుక్రవారం (డిసెంబర్ 20) ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..

ఘజియాబాద్‌లోని లక్ష్మీ కాలనీ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకురాలు భావనా బిష్త్ పిల్లలు, పొరుగింటికి చెందిన పిల్లలు ఆడుకుంటూ ఉండగా గురువారం కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ రెండు కుటుంబాలు పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నాయి. అయితే, శుక్రవారం ఉదయం ఈ విషయంపై కొంతమంది వ్యక్తులు ‘పంచాయతీ’ (సమావేశం) పిలిచారు. ఈ సమయంలో, బీజేపీ నాయకురాలు భావనా, స్థానికుల మధ్య ఈ వివాదంపై మళ్లీ గొడవ చెలరేగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు కర్రలతో భావనా, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో కనీసం 10 నుంచి 12 మంది వ్యక్తులు తొలుత వాదులాడుకోవడం కనిపిస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. ఓ వ్యక్తి కర్ర కూడా తీసుకొచ్చి దాడి చేసేందుకు యత్నించాడు. ఈ దాడిలో తన చేతికి గాయమైందని ఆమె ఆరోపించింది. వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేసింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని అంకుర్ విహార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.