Bhadra Movie: ‘భద్ర’ సినిమా హీరోయిన్ సత్య గుర్తుందా ?.. ఇప్పుడెం చేస్తుందో తెలుసా..

సునీల్ ప్రేమను ఓ ఆటాడుకున్న కథానాయికగా కనిపించింది సత్య. ఈ సినిమాతో ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. సత్య పాత్రలో నటించిన హీరోయిన్ పేరు సనోబర్ హెరేకర్.

Bhadra Movie: 'భద్ర' సినిమా హీరోయిన్ సత్య గుర్తుందా ?.. ఇప్పుడెం చేస్తుందో తెలుసా..
Bhadra
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 19, 2023 | 12:15 PM

మాస్ మాహారాజా రవితేజ కెరీయర్‏లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న చిత్రాల్లో భద్ర ఒకటి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బోయపాటి. ఇందులో రవితేజ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా.. మురళి మోహన్, సునీల్, ప్రకాష్ రాజ్, ఆర్జన్ బజ్వా, ఈశ్వరి రావు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో తన కామెడీతో ప్రేక్షకులను కడపుబ్బా నవ్వించాడు సునీల్. అయితే ఈ చిత్రంలో సునీల్ ప్రేమను ఓ ఆటాడుకున్న కథానాయికగా కనిపించింది సత్య. ఈ సినిమాతో ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. సత్య పాత్రలో నటించిన హీరోయిన్ పేరు సనోబర్ హెరేకర్.

సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈ సినిమా తర్వాత సనోబర్ మరో చిత్రంలో కనిపించలేదు. సినిమా వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ మరో సినిమా చేయలేదు సనోబర్. అటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గత కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సనోబర్.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. హిందీలో పలు చిత్రాల్లో నటిస్తుంది సనోబర్ హెరేకర్. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. అజీజ్ జీ అనే ఆర్టిస్ట్ ను పెళ్లి చేసుకున్న సనోబర్ హెరేకర్.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పింది. బిజినెస్ రంగంలో సనోబర్ రాణిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.