AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antara Mali: ఆర్జీవీ ప్రేమకథ హీరోయిన్ గుర్తుందా ..? ఇప్పుడేం చేస్తుందంటే..

అందులో అంతర మాలి ఒకరు. తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ అప్పట్లో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. 2000వ దశకం ప్రారంభంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించిన అద్భుతమైన హీరోయిన్లలో అంతర మాలి ఒకరు. 1998లో ధూండతే రెహ్ జావోగే సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫస్ట్ మూవీ ప్లాప్ కావడంతో అంతరకు అంతగా గుర్తింపు రాలేదు.

Antara Mali: ఆర్జీవీ ప్రేమకథ హీరోయిన్ గుర్తుందా ..? ఇప్పుడేం చేస్తుందంటే..
Antara Mali
Rajitha Chanti
|

Updated on: May 12, 2024 | 6:49 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తొలి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ ఆ తర్వాత మరో సినిమా చేయకుండానే సినీ పరిశ్రమకు దూరమయ్యారు. నటిగా కెరీర్ మంచి ఫాంలో కొనసాగుతుందనుకుంటే ఊహించని విధంగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే్స్తుంటారు. అందులో అంతర మాలి ఒకరు. తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ అప్పట్లో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. 2000వ దశకం ప్రారంభంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించిన అద్భుతమైన హీరోయిన్లలో అంతర మాలి ఒకరు. 1998లో ధూండతే రెహ్ జావోగే సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫస్ట్ మూవీ ప్లాప్ కావడంతో అంతరకు అంతగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాతి ఏడాది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రేమకథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆర్జీవీ దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో నటించింది. మస్త్, రోడ్, కంపెనీ, దర్నా మనాహై చిత్రాల్లో నటించింది. 2005లో దర్శకురాలిగా మారింది. ఆమె స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం మిస్టర్ యా మిస్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది అంతర. దాదాపు 5 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అంతర 2010లో అమోల్ పాలేకర్ దర్శకత్వం వహించిన వన్స్ ఎగైన్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.

ప్రసిద్ధ భారతీయ ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి కుమార్తెనే అంతర మాలి. జూన్ 12, 2009న GQ మ్యాగజైన్ ఎడిటర్ అయిన చే కురియన్‌ను అంతరా మాలి వివాహం చేసుకుంది. వీరికి 2012లో పాప జన్మించింది. అయితే అంతర తండ్రి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబై వీధుల్లో రోడ్ల పై దయనీయ స్థితిలో కనిపించాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే సమయానికి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోకపోవడం వల్లే అలా జరిగిందని.. తాను ప్రెగ్నెంట్ గా ఉండడంతో తండ్రిని చూసుకోలేకపోయానని అంతర వివరణ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Che Kurrien (@chekurrien)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us