Chandramukhi: ‘చంద్రముఖి’ మూవీలో కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎంత అందగా ఉందో తెలుసా ?.. ఏం చేస్తుందంటే..
2005లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు చాలామందికి టీవీలకే అతుక్కుపోతారు. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఈ మూవీ. ఇందులో జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించగా.. పీ.వాసు దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందులో 'అత్తింధోం.. ' సాంగ్ చాలా ఫేమస్. ఈ పాటలో కనిపించే చిన్నారి గుర్తుందా ?.. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ.. రజినీతోపాటు పాట పాడేస్తుంది. ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు చాలామందికి టీవీలకే అతుక్కుపోతారు. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఈ మూవీ. ఇందులో జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించగా.. పీ.వాసు దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందులో ‘అత్తింధోం.. ‘ సాంగ్ చాలా ఫేమస్. ఈ పాటలో కనిపించే చిన్నారి గుర్తుందా ?.. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ.. రజినీతోపాటు పాట పాడేస్తుంది. ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. బాలనటిగా తమిళంలో ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసింది. ఇక చంద్రముఖి సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్నారి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అప్పట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఆ చిన్నారిని ఇప్పుడు మరింత అందంగా చూసి షాకవుతున్నారు నెటిజన్స్.
దాదాపు 18 ఏళ్లకు నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత.. ఇప్పుడు బుల్లితెరపై ఓ సీరియల్లో నటిస్తుంది. ఆమెకు 2021లోనే వివాహం కాగా.. 2022లో ఓ పాపకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రహర్షిత.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ తన భర్తతో, కూతురితో దిగిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె షేర్ చేసే ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇక గతంలో ప్రహర్షిత షేర్ చేసిన వీడియో ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతుంది.
View this post on Instagram
అందులో చిన్నప్పుడు చంద్రముఖి సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది ప్రహర్షిత. ఆ వీడియోలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




