అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
సంగీతానికి భాష అక్కర్లేదు.. వైబ్ మ్యాచ్ అయితే చాలు.. కొన్ని పాటలు యూట్యూబ్ లో తెగ ట్రెండింగ్ అవుతుంటాయి. విడుదలై సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ పాటల తాలుకూ సంచలనం మాత్రం రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ పాట అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో తెలుసుకుందామా.

సాధారణంగా గ్లామర్ పాటలకు సినీరంగంలో ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ.. ఇలా భాషతో సంబంధం లేకుండా యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన సాంగ్స్ చాలా ఉన్నాయి. అందులో పరదేశి ఒకటి. ఈ సాంగ్ గుర్తుంద మీకు ? 90’s కుర్రాళ్లకు అప్పట్లో పిచ్చెక్కించేసింది. ప్రేమ విఫలమైన కుర్రాళ్లు.. ప్రియసి వదిలి వెళ్లిపోయిన యూత్ ఈ పాటను తెగ పాడుకునేవారు. అదేనండీ.. హిందీలో సూపర్ హిట్ పాటలలో ఒకటైనా పరదేశి సాంగ్.. రాజా హిందుస్తానీ సినిమాలోని పరదేసీ పరదేసీ జానా నహీ పాట మీకు గుర్తుండే ఉంటుంది. ఈ పాటకు ఇప్పటికీ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.
ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..
అమిర్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా నటించిన రాజా హిందూస్తానీ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. అలాగే ఈ సినిమాలోని పరదేశి సాంగ్ సైతం సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటలో కనిపించిన గ్లామర్ క్వీన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా.. ? పరదేశి పాటలో కనిపించిన అమ్మడు పేరు ప్రతిభా సిన్హా. ఆమె ప్రముఖ నటి మాలా సిన్హా కుమార్తె. 1969 జూలై 4న కోల్ కతాలో జన్మించారు. 1992లో వచ్చిన మెహబూబ్ మేరే మెహబూబ్, దిల్ హై బేతాబ్, మిలిటరీ రాజా, తూ చోర్ మే సిపాహి, కల్ కీ ఆవాజ్, పోకిరీ రాజా, లే చల్ అప్నా సాంగ్స్, రాజా హిందుస్తానీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara – Trisha : 40 ఏళ్ల వయసులో చెక్కు చెదరని సోయగం.. నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోస్ వైరల్..
పరదేశి పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు ఆమె ప్రతిభ సంగీతకారుడు నదీప్ సైఫీతో ప్రేమలో పడింది. అప్పటికే అతడు వివాహితుడు కావడంతో వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రతిభ .. ఇప్పుడు తన తల్లితో కలిసి ముంబైలో నివసిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
