AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane: మీరు చెరకుగడ తింటున్నారా..? ఈ లాభాలు తెలుసుకుంటే అస్సలు మిస్ అవ్వరు!

Sugarcane: చెరకుగడను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చెరకు గడను నేరుగా తీసుకోవడం వల్లే ఎక్కువ లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెరకు గడను నేరుగా తినడం వల్ల మన ఆరోగ్యానికి లభించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Sugarcane: మీరు చెరకుగడ తింటున్నారా..? ఈ లాభాలు తెలుసుకుంటే అస్సలు  మిస్ అవ్వరు!
Sugarcane2
Rajashekher G
|

Updated on: Jan 22, 2026 | 12:58 PM

Share

చెరకుగడ(Sugarcane).. చక్కెర, బెల్లంకు ముడి సరకు అయిన దీనిని మనం చాలా తక్కువగా తీసుకుంటాం. మార్కెట్లు, బజార్లలో వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. కానీ, మనం ఎక్కువగా వీటిని పట్టించుకోం. కొన్నిసార్లు చెరకు రసం జ్యూస్ రూపంలో తీసుకుంటాం. కానీ, చెరకు గడను నేరుగా తీసుకోవడం వల్లే ఎక్కువ లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెరకు రసం తాగితే లాభం ఉంటుందని చాలా మందికి తెలిసినప్పటికీ.. చెరకుగడ తినడం ఆరోగ్యానికి ఇంకా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు గడను నేరుగా తినడం వల్ల మన ఆరోగ్యానికి లభించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చెరకు గడ తినడం వల్ల వచ్చే లాభాలు

జీర్ణక్రియ మెరుగు.. నియంత్రణలో బరువు

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెరకు గడలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల పేగులు సక్రియంగా పనిచేస్తాయి. జీర్ణం మెరుగవుతుంది. అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది. చెరకు గడను తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. తక్కువ తింటారు. దీంతో బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఇది “నేచురల్ డైట్ ఫైబర్” లా పని చేస్తుంది.

చెరకు గడలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆహారంలో ఉండే షుగర్ శరీరంలో వేగంగా జీర్ణం అవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోస్ స్థాయి స్టేబుల్ అవుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా మితంగా మంచిది. కానీ, డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే తినాలి.

కాలేయ ఆరోగ్యానికీ మేలు

ఇది కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిది. చెరకు గడలో ఉండే పోషకాలు శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. అందువల్ల కాలేయం క్లీనింగ్ అవుతుంది. విషకణాలు బయటకు బయటకు పోతాయి. శరీరం శుభ్రంగా ఉంటుంది

శరీర సమతుల్యత

శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. చెరకు గడ తినడం వల్ల శరీరంలో నీటి సమతుల్యత నిల్వ ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది. వేడిలో శరీరం తేమగా ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది

చెరకు గడలో ఉండే ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు హృదయానికి కూడా ఉపయోగపడతాయి. కాలేయంలో కొవ్వు తగ్గించడంలో సహాయం చేస్తుంది. కోలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీంతో హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది. చెరకు గడలో ఉండే తీపి పదార్థం శరీరానికి శక్తి ఇస్తుంది. ఇది అలసట తగ్గిస్తుంది. పని చేయడానికి ఎనర్జీ ఇస్తుంది. రోజువారీ శక్తి అవసరాన్ని తీర్చుతుంది.

చెరకు తినడంలో జాగ్రత్తలు

చెరకు గడ తినడం మంచిది అయినా, కొన్ని విషయాలు గమనించాలి. ఎక్కువగా తింటే పేగు సమస్యలు రావచ్చు. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచనతో మాత్రమే తినాలి. రోజు 1-2 టేబుల్ స్పూన్ పరిమితిలో సరిపోతుంది. దంతాల ఆరోగ్యానికి కూడా జాగ్రత్త తీసుకోవాలి. తినాక ముక్కలు పళ్ల మధ్య ఇరుక్కుంటే వెంటనే బ్రష్ చేసుకోవాలి.