AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే ఏమవుతుందో తెలుసా..?

మనలో చాలామందికి టీతోనే రోజు మొదలవుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఆ కప్పుల సంఖ్య మరింత పెరుగుతుంది. చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఈ అలవాటు వ్యసనంగా మారితే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగడం సురక్షితం? కెఫిన్ వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.

చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే ఏమవుతుందో తెలుసా..?
Tea Benefits And Side Effects In Winter
Krishna S
|

Updated on: Jan 22, 2026 | 11:44 AM

Share

బయట చలి వణికిస్తుంటే.. చేతిలో ఆవిర్లు కక్కే వేడి వేడి టీ కప్పు ఉంటే ఆ మజానే వేరు. ఆ వెచ్చదనం శరీరానికే కాదు, మనసుకూ ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అందుకే చలికాలంలో చాలామంది రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతున్నారో కూడా లెక్కలేనంతగా అలవాటు పడిపోతుంటారు. అయితే ఈ టీ ప్రేమ ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? లేక కీడు చేస్తుందా..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

పరిమితంగా టీ తాగడం వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్లు శరీరంలోని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడతాయి. ఇందులోని కెఫిన్, ఎల్-థియనిన్ కలయిక మెదడును చురుగ్గా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. అల్లం, పుదీనా కలిపిన హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చలికాలంలో వచ్చే ఫ్లూ నుంచి రక్షణ కల్పిస్తాయి.

అతిగా తాగితే వచ్చే అనర్థాలివే

ఏదైనా అమితమైతే విషమే! అతిగా టీ తాగడం వల్ల టీలోని కెఫిన్, టానిన్లు శరీరానికి హాని చేస్తాయి. నిద్రలేమి: రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ శరీరంలోకి చేరితే.. నిద్ర పట్టకపోవడం, గుండె వేగం పెరగడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

రక్తహీనత: టీలోని టానిన్లు ఆహారం నుంచి ఇనుము (Iron) గ్రహించకుండా శరీరాన్ని అడ్డుకుంటాయి. ఇది రక్తహీనతకు దారితీసే అవకాశం ఉంది.

అసిడిటీ: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వికారం, గ్యాస్ మరియు కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.

దంతాల సమస్య: ఎక్కువగా టీ తాగడం వల్ల దంతాలపై మరకలు పడటమే కాకుండా, దంతక్షయం కూడా సంభవించవచ్చు.

రోజుకు ఎన్ని కప్పులు సేఫ్?

సాధారణంగా ఆరోగ్యవంతులు రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.

  • కెఫిన్‌కు సున్నితంగా ఉండేవారు దీనిని తగ్గించాలి.
  • గర్భిణీ స్త్రీలు రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ టీ తీసుకోకూడదు.
  • టీలో చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

చలికాలంలో టీని ఆస్వాదించండ.. కానీ అది ఒక వ్యసనంగా మారకుండా చూసుకోండి. పరిమితంగా తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..