AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్ లుక్స్.. లేదా రెండు పాటలతో సరిపెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తమ నటనకు ప్రశంసలు అందుకుంటారు. కానీ మీకు గుర్తుందా.. ? నీలాంబరి పాత్ర. నరసింహా సినిమాలో ఏకంగా రజినీకాంత్ పాత్రనే డామినేట్ చేసింది. అదే విధంగా ఈ హీరోయిన్ రోల్ సైతం సినిమాకే హైలెట్ అయ్యింది.

Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
Rukmini Vasanth
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2026 | 8:49 AM

Share

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ అంటే రెండు పాటలు, గ్లామర్ లుక్స్ మాత్రమే అని భావిస్తారు. కానీ ఆ ట్రెండ్ గతంలో నీలాంబరి పాత్రతో తుడిచేశారు రమ్యకృష్ణ. నరసింహా సినిమాలో నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే నెగిటివ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్రలో తన నటనతో ఆశ్చర్యపరిచింది. ఇందులో ఏకంగా రజినీ పాత్రనే డామినేట్ చేసింది నీలాంబరి. ఇప్పుడు అదే స్థాయిలో విలన్ పాత్రలో ఊహించని షాకిచ్చింది ఓ హీరోయిన్. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలతో స్టార్ డమ్ సంపాదించుకుంటున్న ఆ హీరోయిన్ పెద్ద రిస్క్ చేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? తన పేరు రుక్మిణి వసంత్.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

రుక్మిణి వసంత్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. సప్త సాగరాలు దాటి సినిమాతో కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. దీంతో తెలుగు, తమిళం, కన్నడ భాషషలలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అదే సమయంలో ఆమె కెరీర్ ప్రారంభంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. మొదట్లో ఆ పాత్ర పోషించడానికి చాలా భయపడిందట. తన కెరీర్‌ను దెబ్బతీస్తుందని రుక్మిణి టెన్షన్ పడిందట. కానీ అదే సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రుక్మిణి కెరీర్ మలుపు తిప్పింది. ఆ సినిమా పేరు కాంతార చాప్టర్ 1. కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

ఈ సినిమా అవకాశం గురించి రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. “నాకు చాలా కష్టమైన నిర్ణయం. కాంతర లాంటి సినిమాకు ఆఫర్ రావడం చాలా పెద్ద విషయం. రిషబ్ శెట్టి సర్ నన్ను దాని కోసం పిలిచినప్పుడు, నేను చాలా సంతోషించాను. కానీ ఆ సినిమాలో నువ్వే విలన్ అని ఆయన అన్నారు. ఇది విన్నప్పుడు, నేను అయోమయంలో పడ్డాను. ఒకింత ఒత్తిడికి గురయ్యాను. మూస పద్దతి కాకుండా సరికొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. కొన్ని పాత్రలు చేయవద్దని.. లేదా ఆ రకమైన పాత్రలు వద్దు అని చెబుతుంటారు. ఒక నటిగా నిర్దిష్ట జోన్ లో ఉండాలని వింటుంటాం. ఆ తర్వాత కాంతార సినిమాకు ఒప్పుకున్నాను. సంవత్సరం భయపడలేదు. కానీ విడుదల సమయం దగ్గరపడినప్పుడు భయం కలిగింది. ఈ సినిమా నా భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందా ? అని టెన్షన్ పడ్డాను. కానీ కాంతార తర్వాత నాకు ప్రశంసలు వచ్చాయి” అంటూ చెప్పుకొచ్చింది. ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్