Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్ చూస్తే..
ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పొలంలో ఉన్న గడ్డివాము ప్రమాదవశాత్తు అంటుకోగా.. రైతులు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఆరకపోగా.. అందులోంచి వింత శబ్ధాలు వచ్చాయి. ఏంటా అని అందరూ దగ్గరవచ్చి చూస్తే.. నాగుపాము పడవిప్పుకొని నిల్చుంది. అది చూసిన రైతులంగా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొలంలో ఉన్న గడ్డివాము అంటుకుంది. అది గమనించిన రైతులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతలోనే గడ్డివాము మంటల్లోంచి బుసలు కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలతో ఓ భారీ నాగుపాము బయటకు వచ్చింది. ఈ ఘటన కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్గోకే వెళ్తే.. రైతు పశువుల కోసం తన పొలంలో గడ్డివాము పేర్చగా అందులో ఓ నాగు పాము నివాసం ఏర్పాటు చేసుకుంది. తాజాగా గురువారం ప్రమాదవ శాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ వేడి తట్టుకోలేక గడ్డివాములో ఉన్న నాగు పాము బయటకు వచ్చింది. ఆ తర్వాత పడగ విప్పి మంటల్లో దగ్ధమవుతున్న వరి గడ్డివాము వైపు చూస్తూ బుసలు కొడుతూ సుమారు గంట సేపు అక్కడే ఉంది. అది చూసిన స్థానిక రైతులు అందరూ షాక్ అయ్యారు. పాము ఎందుకు అంత కోపంగా గడ్డివైపు చూస్తు బుసలు కొడుతుందో వాళ్లకు అర్థం కాలేదు.
అయితే అక్కడే ఉన్న కొందరు రైతులు ఈ దృశ్యాలను తమ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో స్పందిచారు. తగలబడుతున్న గడ్డివాములో దాని పిల్లలు, లేదా తోటి పాము ఏమైనా ఉన్నాయేమో అందుకే అది అంతకోపంగా చూస్తుందని కామెంట్ చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
