70 ఏళ్లలో మొదలైన వ్లాగ్.. 72 గంటల్లోనే 3 కోట్ల మంది చూసేశారు.. యూట్యూబ్ సెన్సేషన్..!
నేటి డిజిటల్ యుగంలో వైరల్ కావడం ద్వారా ఎవరు ఎప్పుడు, ఎలా ఫేమస్ అవుతారో ఊహించడం అసాధ్యం. కుంభమేళాలో రుద్రాక్ష అమ్మే మోనాలిసా ఇప్పుడు స్టార్ నటిగా మారింది.. ఆమె విజయం వెనుక ఎవరున్నారో చూస్తే, కారణం సోషల్ మీడియా. అదేవిధంగా, ఇక్కడ ఒక వ్లాగ్ దెబ్బతో మిలియన్ల వ్యూస్ సంపాదించి ఫేమస్ అయిన ఒక వృద్ధుడి కథ ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. 70ఏళ్ల ఆ వృద్ధుడు చేసిన తొలి వ్లాగ్.. కేవలం 72 గంటల్లోనే 3కోట్ల వ్యూస్ సంపాదించింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు స్టార్‌గా మారుస్తుందో చెప్పలేం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మకు వ్లాగింగ్ గురించి తెలియకపోయినా, టైమ్‌పాస్ కోసం చేసిన తొలి వ్లాగ్ 72 గంటల్లోనే 3 కోట్ల వ్యూస్ సాధించింది. ఆయన నిజాయితీ, వినయం లక్షలాది మంది హృదయాలను హత్తుకొని, ఆయన్ను రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మార్చాయి. ఇది వయస్సుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా శక్తిని నిరూపించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మకు సోషల్ మీడియా లేదా వ్లాగ్ ఎలా చేయాలో తెలియదు. కానీ, అతను ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్లాగ్ చేశాడు. ఆ వీడియోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. లైక్‌లు, కామెంట్లు మిలియన్ మార్కును దాటాయి. వీడియోలో వినోద్ కుమార్ నిజాయితీ, వినయం లక్షలాది మంది హృదయాలను తాకింది. అతను చెప్పినది ప్రజలకు వారి సొంత తల్లిదండ్రులు, తాతామామలను గుర్తు చేస్తుంది. అతను చెప్పింది వారందరినీ సంతోషపెట్టిందంటూ సోషల్ మీడియాలో చాలా మంది వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…
వీడియోలో వినోద్ కుమార్ శర్మ తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.. నా పేరు వినోద్ కుమార్ శర్మ, ఉత్తరప్రదేశ్ నివాసి. నాకు వ్లాగ్ ఎలా చేయాలో తెలియదు. కానీ, టైమ్ పాస్ కోసం వ్లాగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చేస్తున్న ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నేను దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి నుండి నేను కూడా వ్లాగ్ చేస్తూనే ఉంటానని మొదలుపెట్టాడు.
వీడియో ఇక్కడ చూడండి…
View this post on Instagram
వినోద్ కుమార్ శర్మ చేసిన ఈ వీడియో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఇది మాత్రమే కాదు, దీనికి 22.2 మిలియన్ లైక్‌లు, 41.1K కామెంట్లు, 18.4K రీపోస్ట్‌లు వచ్చాయి. దీనికి ఇప్పటికీ వ్యూస్ వెల్లువల వస్తున్నాయి. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు అతనికి 64,000 కంటే ఎక్కువ మంది యాడ్ అయినట్టుగా చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




