AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్ ఫ్యాక్ట్..!

రుమాలీ రోటీ.. చాలా మందికి ఈ రుమాలి రోటీ అంటే ఎంతో ఇష్టం. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లినప్పుడు వీటిని తప్పక టేస్ట్ చేస్తుంటారు. అలాగే.. కొంతమంది రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు పన్నీరు, ఏదైనా నాన్​వెజ్​ కర్రీతో రుమాలి రోటీని ఆర్డర్ చేసి ఆస్వాదిస్తుంటారు. ఇంకొందరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఇంతకీ ఈ రుమాలి రోటీ స్టోరీ ఏంటో మీకు తెలుసా..? మొఘలుల కాలంలో పరిచయమైన ఈ వంటకాన్ని వారు ఎందుకు తయారు చేశారో తెలిస్తే షాక్ తింటారు. ఎందుకో మీరే చూడండి..

రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్ ఫ్యాక్ట్..!
Rumali Roti
Jyothi Gadda
|

Updated on: Jan 22, 2026 | 9:04 AM

Share

మొఘల్ కాలంలో భారతదేశానికి అనేక కొత్త, రుచికరమైన వంటకాలు పరిచయం చేయబడ్డాయి. వీటిని ఇప్పటికీ ప్రజలు ఇష్టంగా తింటారు. చపాతీ భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ, ధాబాలలో తినడానికి వెళ్ళే వారిలో తందూర్ రోటీ, రుమాలి రోటీ బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా మాంసాహారులు రుమాలి రోటీని ఇష్టపడతారు. మృదువైన, పెద్ద రుమాలి రోటీలను ఇష్టంగా ఆస్వాదిస్తారు. కానీ, నేడు మనం తినే రుమాలి రోటీని మొదట్లో తినడానికి తయారు చేయలేదని తెలిస్తే నమ్ముతారా…? అయితే, మరీ దీన్నిఎందుకు తయారు చేశారో తెలిస్తే మాత్రం ఇకపై ఖచ్చితంగా కంగుతింటారు.

మొఘల్‌ కాలంలో పరిచయమైన రుమాలి రోటీ..

రుమాలి రోటీ మొదటగా మొఘల్ పాలనలో ప్రారంభించబడింది. మొఘల్ కాలంలో రుమాలి రోటీని రాజ భోజనంతో కూడా వడ్డించేవారు. కానీ, ఆ సమయంలో రుమాలి రోటీని తినడానికి కాదని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..దీనిని వేరే ప్రయోజనం కోసం ఉపయోగించారు. ఆహారం నుండి అదనపు నూనెను తొలగించడానికి, లేదంటే, ఏదైనా తుడవడానికి రుమాలి రోటీని ఉపయోగించేవారట. రుమాలి రోటీని ప్లేట్‌లో ఆహారాన్ని పట్టుకోవడానికి కూడా ఉపయోగించారు. రుమాలి అంటే రుమాలు(కర్ఛీఫ్‌, టవల్‌). దీనిని మనం చేతులు, ముక్కు, నోరు తుడుచుకోవడానికి ఉపయోగిస్తాము. అలాగే, కొన్ని వస్తువులను తుడవడానికి రుమాలు ఉపయోగిస్తారు. అప్పట్లో రుమాలి రోటీని కూడా ఇలాంటి పనుల కోసం ఉపయోగించారు. ఆహారాలను కవర్ చేయడానికి కూడా ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి

మొదట ఎక్కడ తయారు చేశారు…

రుమాలి రోటీని మొదట పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో తయారు చేశారు. అక్కడ దీనిని రుమాలి రోటీ అని కాదు, మండా లేదా లంబు రోటీ అని పిలుస్తారు. రుమాలి రోటీని సాధారణంగా చిక్కటి, క్రీమీ కూరలతో తింటారు. మొఘలుల కాలంలో రుమాలి రోటీని రుమాలులా మడిచి రాజు కోసం డైనింగ్ టేబుల్‌పై ఉంచేవారు. రుమాలి రోటీ మెత్తగా, సన్నగా ఉంటుంది.

మొఘల్ కాలంతో సంబంధం..

రుమాలి రోటీ ఢిల్లీ, లక్నో, పరిసర ప్రాంతాలలో పుట్టి పెరిగిన వారు కొందరు ఇప్పటికీ పాటిస్తారు. అక్కడ మొఘల్ ఆస్థానంలో గొప్ప, సున్నితమైన వంటకాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉండేవి. రాజ ఆస్థానం భారీ నాన్ లేదా పరాఠాలకు బదులుగా తేలికైన, త్వరగా తయారు చేయగల, తేలికపాటి రుచిగల బ్రెడ్/పోలీని కోరుకుంది. అందుకే రుమాలి రోటీ ప్రజాదరణ పొందింది.

ప్రత్యేక తయారీ పద్ధతి..

గతంలో రుమాలి రోటీని తలక్రిందులుగా చేసిన తవాపై కాల్చేవారు. ఇప్పటికీ చాలా చోట్ల ఇదే విధానం కొనసాగుతోంది. ఈ తవా తొందరగా ఎక్కువ వేడిని అందిస్తుంది. రోటీ ఉబ్బి, క్షణంలో ఉడికిపోతుంది. సన్నని, మృదువైన ఆకృతిలోకి వస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టీమిండియా పాలిట విలన్లు వీరే.! ఆ ముగ్గురు లేకుంటే
టీమిండియా పాలిట విలన్లు వీరే.! ఆ ముగ్గురు లేకుంటే
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?