AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mana Shankaravaraprasad Garu : మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఎంతంటే.. నిర్మాత సుష్మిత కొణిదెల..

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ప్రస్తుతం సినీరంగంలో నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఇటీవల ఆమె నిర్మించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే చిరంజీవి సినీ రంగం పట్ల అంకితభావం, నిర్మాణ రంగంలో ఆమె ప్రయాణం, సహ-నిర్మాణం ప్రాముఖ్యత, కుటుంబంతో వృత్తిగత సంబంధాలను ఆమె వివరించారు.

Mana Shankaravaraprasad Garu : మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఎంతంటే.. నిర్మాత సుష్మిత కొణిదెల..
Sushmitha Konidela
Rajitha Chanti
|

Updated on: Jan 22, 2026 | 10:57 AM

Share

సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టా్ర్ చిరంజీవి. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని చిరు పెద్ద కూతురు సుష్మిత కొణిదెల నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సుష్మిత కొణిదెల ఇటీవల తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ సినిమా విజయం గురించి మాట్లాడారు. ప్రేక్షకుల ఆనందం, థియేటర్లకు కుటుంబాలు తిరిగి రావడాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందని ఆమె అన్నారు. మెగా అభిమానులు “బాస్ ఈజ్ బ్యాక్” అని సంబరాలు చేసుకుంటున్నారని, వింటేజ్ చిరంజీవిని చూడాలని వారు ఆశించారని తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను సమతుల్యం చేశారని ఆమె ప్రశంసించారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో తాను మొదట కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశానని వెల్లడించారు. చిరంజీవి ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ, పని పట్ల ఆయనకున్న అంకితభావం గురించి ఆమె వివరించారు. సెట్‌లో చిరంజీవి దృష్టి పూర్తిగా దర్శకుడి అవసరాలపైనే ఉంటుందని ఆమె అన్నారు. వెంకటేష్, నయనతార వంటి నటీనటులతో కలిసి పనిచేయడం ఆహ్లాదకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో తాను గతంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా మాత్రమే పనిచేశానని అన్నారు. తాను చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసినప్పుడు కూడా రెమ్యునరేషన్ తీసుకునేదానినని ఆమె వెల్లడించారు. సెట్‌లో తనను చిరంజీవి కుమార్తెగా కాకుండా, కేవలం నిర్మాతగా మాత్రమే చూస్తారని ఆమె తెలిపారు.

చిరంజీవి, వెంకటేష్ మధ్య బలమైన బంధం సెట్‌లో కూడా కనిపించిందని, వారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని సుష్మిత కొణిదెల అన్నారు. వెంకటేష్ ప్రాజెక్టును వెంటనే అంగీకరించారు. వెంకటేశ్ రెమ్యునరేషన్‌ విషయంలో డిబేట్‌ ఏం జరగలేదు. ఈ సినిమాకు ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన స్క్రీన్‌పై కనిపించిన దగ్గర నుంచి ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్‌ అయ్యారు. ఆయన తీసుకున్న రెమ్యునరేషన్‌కు పూర్తి న్యాయం చేశారు . ఆయనకు ఎంత ఇవ్వాలన్నా మాకు ఆనందమే. వ్యక్తిగతంగానూ ఆయన చాలా పాజిటివ్‌గా ఉంటారు.  తెలిపారు. వారిద్దరితో పూర్తి నిడివి సినిమా తీసే అవకాశం వస్తే అది చాలా అదృష్టమని అన్నారు. రామ్ చరణ్ తన దుస్తులపై వ్యక్తిగత శ్రద్ధ చూపుతారని, చిరంజీవి దుస్తులను తానూ ఎంపిక చేస్తానని, బహుమతులు కూడా ఇస్తానని పేర్కొన్నారు. ఇటీవల హిట్ అయిన “మీసాల పిల్ల” కాస్ట్యూమ్‌ను తాను వ్యక్తిగతంగా కొని బహుమతిగా ఇచ్చానని, అది సినిమాలో ఒక ఐకానిక్ లుక్‌గా మారిందని ఆమె గుర్తుచేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఈ సినిమా చూడలేదని, ఆయనకు చూపించడానికి ఎదురుచూస్తున్నామని సుష్మిత కొణిదెల తన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..

Follow Us
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి