Nari Nari Naduma Murari: నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే.. చేసుంటే మరో హిట్టుపడేదే..
సంక్రాంతి పండక్కి విడుదలైన సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒకరాజు, భర్త మహశయులకు విజ్ఞప్తి, రాజాసాబ్, నారీ నారీ నడుమమురారి సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా హిట్టు కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ ఖాతాలో హిట్టుపడింది.

చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరో శర్వానంద్. ఎప్పుడూ విభిన్న కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి సరికొత్త జానర్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఆయన నటించిన లేటేస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే డీసెంట్ వసూళ్లను సైతం రాబడుతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమాకు రోజు రోజుకీ మరింత పాజిటివ్ టాక్ వస్తుంది. మొత్తానికి సంక్రాంతి పండక్కి సరైన హిట్టు అందుకున్నారు శర్వానంద్. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.
ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
గతంలో సామజవరగమన సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారీ సినిమాతో మరోసారి మెప్పించారు. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. వీకే నరేష్, సిరి హనుమంతు, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సుదర్శన్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో శర్వానంద్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. అయితే మీకు ఒక విషయం తెలుసా. ? శర్వానంద్ నటించిన ఈ చిత్రాన్ని ఓ టాలీవుడ్ హీరో మిస్సాయారట. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ?
ఎక్కువ మంది చదివినవి : Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నిజానికి నారీ నారీ నడుమ మురారి సినిమాకు ముందు అనుకున్న శర్వానంద్ కాదట. అంతకు ముందు ఈ చిత్రాన్ని అక్కినేని హీరో నాగచైతన్యతో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ అప్పటికే ఇతర ప్రాజెక్టులతో చైతూ బిజీగా ఉండడంతో ఈసినిమాను చేయలేకపోయారట. చివరకు ఈ మూవీ స్టోరీ శర్వానంద్ వద్దకు చేరింది. ఈ ప్రాజెక్ట్ కంటే ముందు మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్నా శర్వానంద్.. ఆ తర్వాత ఆ స్థాయిలో మరో సినిమా ఆకట్టుకోలేకపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara – Trisha : 40 ఏళ్ల వయసులో చెక్కు చెదరని సోయగం.. నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోస్ వైరల్..

Nari Naduma Murari Movie, N
ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..
